common ticket, good news for hyderabadis హైదరాబాదీలకు సర్కార్ గుడ్ న్యూస్..

Telangana government planning for common ticket good news for hyderabadis

mmts metro rtc common ticket, mmts metro common ticket, mmts rtc buses common ticket, metro rtc busses common ticket, common ticket, mmts, metro rail, rtc buses, hyderabadis, good news, telangana government, chief secratary sp singh, hyderabad metro rail board chairman, sp singh

telangana government planning for common ticket for travelling in Metro, MMTS and RTC city buses, good news for hyderabadis

హైదరాబాదీలకు సర్కార్ గుడ్ న్యూస్.. అంతా కామన్..

Posted: 09/20/2017 12:11 PM IST
Telangana government planning for common ticket good news for hyderabadis

హైదరాబాద్ నగరవాసులు ఎప్పుడెప్పుడా అంటూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాలు ఈ నవంబర్ లో ముగిసిపోనున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభం కానున్న సంగతి అందరికీ తెలసిందే. అయితే మెట్రో రైలు రాకతో అటు అర్టీసీ, ఇటు ఎంఎంటీఎస్ రైళ్లుకు ఎలాంటి భారం పడకుండా చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశం. దీనికి తోడు నగరవాసికి నగరంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా.. ఎందులోంచి (మెట్రో, ఎంఎంటీఎస్, అర్టీసీ) ఎందులోనైనా ప్రయాణించే సౌకర్యం కల్పించాలని కూడా అధికారులు యోచిస్తున్నారు.  

ఇలా చేస్తే నగరవాసులకు అందుబాటులో వున్న అన్ని రవాణా సదుపాయాలను అనుసంధానించినట్లు అవుతుందని, దీంతో నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కూడా జరుగుతుందని, ఫలితంగా నగరం కాలుష్య నివారణ చర్యలకు కూడా అడుగుముందుకు పడినట్లు అవుతుందన భావించిన ప్రభుత్వం హైదరాబాద్ వాసులకు శుభవార్తను అందించింది. మెట్రో రైలు ప్రారంభమైన తరువాత ఈ మూడు రవాణా వ్యవస్థలను అనుసంధానం చేసేందుకు చర్యలను తీసుకుంది.

ఇందుకోసం ఏ వ్యవస్థలో ప్రయాణం చేసినా మాటిమాటికీ టిక్కెట్ తీసుకునే అవసరం లేకుండా కామన్ టిక్కెట్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు స్మార్ట్‌ కార్డ్‌ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకు రావాలని సీఎస్‌, హైదరాబాద్ మెట్రో రైల్ బోర్డు చైర్మన్ ఎస్పీ సింగ్ ఆదేశించారు. మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ముఖ్యంగా మూత్రశాలలు, బస్ బేలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మియాపూర్‌-అమీర్‌పేట్‌ మార్గంలో మెట్రోను ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులను నవంబర్‌ మొదటి వారంలోగా తీసుకోవాలని ఎస్పీ సింగ్ సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : common ticket  mmts  metro rail  rtc buses  hyderabadis  good news  telangana government  

Other Articles