2 Students From Telugu states Drown In Ukraine విషాదం: ఉక్రయిన్ లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

Telugu students in ukraine drowned playing beach volleyball

Ashok Kumar, shivakanth reddy, hyderabad students, telugu students die in ukraine, telugu students drowned death, telugu students beach volley ball, telugu students death, telugu students Ukraine, telugu students, beach volley ball, drowned death, hyderabad, kuntur, kadapa

Two students from Hyderabad drowned in Ukriane when they ventured into a treacherous sea to rescue another of their friend while playing volleyball on the beach.

ఉక్రెయిన్ విషాదం: స్నేహితుడ్ని రక్షించి.. తెలుగు విద్యార్థుల మృతి

Posted: 09/20/2017 10:54 AM IST
Telugu students in ukraine drowned playing beach volleyball

ఉక్రెయిన్ లో జరిగిన విషాధ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో విషాదాన్ని నింపింది. తమ స్నేహితుడు నదిలో తరంగాలలో చిక్కకుని ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడాని గమనించిన ఆ ఇద్దరు చకచకా వెళ్లి అతన్ని సురక్షిత ప్రాంతానికి నెట్టారు.. కానీ అదే ప్రమాదకరమైన అలలకు వారు బలైపోయారు. ఈ ఘటనలో ఉక్రెయిన్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాధాన్ని నింపింది. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తూ మృతిచెందిన ఘటనపై వారివారి స్వస్థలాల్లో విషాధం అలుముకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసించి మరో ఏడాదిలో పూర్తి చేసుకుని డాక్టర్లుగా భారతావనిపై కాలుమోప బోతున్న ఇద్దరు తెలుగు రాష్ట్ర విద్యార్థులు తమ స్నేహితున్ని రక్షించే క్రమంలో నదిలో మృత్యువాత పడ్డారు. హైదరాబాద్‌లోని కుంట్లూరుకు చెందిన శివ కాంత్ రెడ్డి, కడపకి చెందిన అశోక్ కుమార్ మారుగుత్తిలు ఉక్రెయిన్ లోని జాపోరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదుతున్నారు.

శివకాంత్ రెడ్డి, అశోక్ కుమార్ లు స్నేహితులతో కలిసి తమ కాలేజీ సమీపంలో వున్న సముద్రంలో బీచ్ వాలీ బాల్ ఆడుతుండగా బాల్‌ సముద్రంలో పడింది. బాల్ తీసుకురావడానికి వెళ్లిన ముఖేష్ అనే మిత్రున్ని రాకాసి అలలు సముద్రంలోకి లాక్కెల్లాయి. అది గమనించిన శివకాంత్‌రెడ్డి, అశోక్‌ కుమార్ లు వెంటనే వెళ్లి ముఖేష్ ను సురక్షిత ప్రాంతానికి నెట్టేశారు. అయితే రాకాసి అలలు మాత్రం అశోక్, శివకాంత్ ల ప్రాణాలను కబళించేశాయి. విద్యార్థుల మృతితో వారి కుటుంబసభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ నెల ఒకటవ తేదీన సెలవులు ముగియడంతో శివ కాంత్ రెడ్డి తిరిగి ఉక్రెయిన్ వెళ్లినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ashok Kumar  shivakanth reddy  telugu students  beach volley ball  drowned death  hyderabad  kuntur  kadapa  

Other Articles