director, teacher detained for student gangrape స్పెషల్ క్లాస్ పేరిట విద్యార్థినిపై డైరెక్టర్, లెక్చరర్ గ్యాంగ్ రేప్..

Rajasthan school director teacher booked for student gangrape

rape, gangrape, Rajasthan, Sikar, battling for life, abortion, Class 12 student, girl battling for life, raped over a period of time, school director, teacher, Jaipur, Ajeetgarh, case filed, gangrape, rajasthan school, 18 year old student, school director, teacher, crime

Day after the horrific rape case of a Sikar high school student came to light, the police today detained the accused school director Jagdish and the teacher, Jagat.

స్పెషల్ క్లాస్ పేరిట విద్యార్థినిపై డైరెక్టర్, లెక్చరర్ గ్యాంగ్ రేప్..

Posted: 09/19/2017 10:01 AM IST
Rajasthan school director teacher booked for student gangrape

సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా.. ఉపాధ్యాయ జాతిలో చెడపుట్టిన నీచులను రాజస్థాన్ లోని శికర్ జిల్లా షహర్ పురా సర్కిల్ పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థీని విద్యార్థులను తమ సోంత పిల్లలా పరిగణించి విద్యాబుద్దలు చెప్పాల్సిన ఉపాధ్యయుడు.. కామంతో కళ్లుమూసుకుపోయేలా వ్యవహరించి.. తనతో పాటు పాఠశాల డైరెక్టర్ కూడా విద్యార్థినిపై అత్యాచారం చేయించాడు. విద్యార్ధిని గర్భం దాల్చడంతో అమెకు అబార్షన్ చేయించగా, అమె అరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో వారు చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి.

వివరాల్లోకి వెళ్తే.. షహార్ పురా సర్కిల్ పోలీసు అధికారి కుషాల్ సింగ్ కథనం ప్రకారం.. తమ పాఠశాలలో స్థానికంగా నివసించే ఓ 18 ఏళ్ల విద్యార్థినికి స్పెషల్ క్లాసులు వున్నాయని పాఠశాలకు పిలిపించుకుని.. అమెపై ఉపాధ్యాయుడు జగత్ సింగ్ గుర్జార్ తో పాటు పాఠశాల డైరెక్టర్ జగదీష్ యాదవ్, లు అఘాయిత్యానికి పాల్పడ్డారు.  ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించేవారు. ఇంట్లో చెబితే తప్పు తనదే అంటారని భయపడ్డ విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం చేయలేకపోయింది.

ఇక అదే అదనుగా భావించిన నిందితులిద్దరూ విద్యార్థినిన తమ అవసరాలకు అనుగూణంగా వాడుకునేవారు. ప్రతినిత్యం వారి చేతిలో అఘాయిత్యానికి గురైనా బాధను అనుభవించిన బాలిక.. ఉపాధ్యాయులపై మాత్రం ఎవరికీ నోరు విప్పి మాట చెప్పలేకపోయింది. ఈ క్రమంలో అమె గర్భందాల్చింది. దీంతో తమ ముసుగు తొలగిపోతుందని ఆందోళన చెందిన జగదీష్ యాదవ్, జగత్ సింగ్ గుర్జార్ లు స్థానికంగా ఆసుపత్రి నడుపుతున్న వైద్య దంపతులు రజ్నీష్ శర్మ, కానన్ లను సంప్రదించి భాదిత బాలికకు వైద్యం చేయాలని కోరారు.

అప్పనంగా డబ్బు వస్తున్నందున వారు కూడా నిందితులకు సహకరించారు. ఇలాంటి కేసుల్లో ముందుగా వారు పోలీసులకు సమాచారం అందించకుండా అబార్షన్ చేసేందుకు పూనుకున్నారు. బాధితురాలికి బలవంతంగా అబార్షన్ చేయడంతో అది వికటించి.. అమె అరోగ్యం విషమించింది. తమ బిడ్డ విషయంలో అందోళన చెందిన తల్లిదండ్రులకు విషయం తెలిసిపోగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాఠశాల డైరెక్టర్, లెక్చరర్, వైద్యులిద్దర్నీ అరెస్టు చేసిన పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. రేపిస్టులపై గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేయగా, నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేయడంపై వైద్య దంపతులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gangrape  rajasthan school  18 year old student  school director  teacher  crime  

Other Articles