RSSS send 68 Paise Cheques as Gift to PM Modi ప్రధాని మోడీకి చెక్కులతో ఆర్ఎస్ఎస్ఎస్ నిరసన..

Rayalaseema farmers send 68 paise cheques as gift to pm modi

narendra modi, prime minister narendra modi,narendra modi birthday, modi, modi birthday, andhra pradesh, rayalaseema region, rayalaseema ngo, rayalaseema saguneeti sadhana samithi, Farmers send cheque to modi, farmers protest

Rayalaseema Sagu Neeti Sadhana Samithi, which organised the protest, collected hundreds of cheques to highlight the agrarian crisis faced by four districts under the Rayalaseema region.

ప్రధాని మోడీకి చెక్కులతో ఆర్ఎస్ఎస్ఎస్ నిరసన..

Posted: 09/18/2017 11:54 AM IST
Rayalaseema farmers send 68 paise cheques as gift to pm modi

దేశ ప్రధాని నరేంద్రమోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని అటు వివిధ దేశాల నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. ఇటు పలువరు జాతీయ నేతల నుంచి రాష్ట్రస్థాయి నేతలు, సామాన్య ప్రజలు.. ఇలా అనేకమంది పార్టీల కతీతంగా పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే అర్ఎస్ఎస్ఎస్ కు చెందని ప్రముఖులు కూడా నరేంద్రమోడీకి వినూత్న తరహాలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతటితో అగని అర్ఎస్ఎస్ఎస్ నేతలు ప్రధానికి బహుమతులను కూడా పంపారు.
 
అయితే ప్రధానికి పంపిన బహుమతులు ఏంటా..? అని అలోచిస్తున్నారా.. ప్రధాని నరేంద్రమోడీ 67 జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న క్రమంలో.. ఆయనకు 68 పైసలతో 400 చెక్కులను పంపారు అర్ఎస్ఎస్ఎస్ నేతలు. అదేంటి 68ఫైసల చెక్కులా అంటారా..? అవునండీ.. ఇది నిజం. ఎందుకలా..? అంటే.. అదే తమ వినూత్న నిరసన అంటున్నారు ఆ నేతలు. అసలు అర్ఎస్ఎస్ఎస్ అంటే ఏంటీ అంటారా..? రాయలసిమ సాగునీటి సాధన సమితి. అర్రే.. మన రాష్ట్రవాసులేగా అంటే ముమ్మాటికీ మన రాయలసీమకు చెందినవారే. వీరింతా కలసి ప్రధాని మోడీకి 68 పైసల చెక్కులను కానుకగా పంపారు.

ఎందుకిలా అంటే.. దేశంలోనే థార్‌ ఎడారి తర్వాత అనంతపురం జిల్లా అత్యల్ప వర్షాపాతం నమోదైన ప్రాంతంగా రికార్డులకెక్కినా.. పాలకులకు మాత్రం ఇది పట్టకపోవడం.. ఇక్కడి రైతుల అక్రంధనలు.. అరణ్యరోధనలుగా మిగిలిపోవడం.. అపన్నహస్తం కోసం ఎదురుచూసి.. ఎదురుచూసి.. నిరీక్షణలో నిరసించి.. చేసేది లేక ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇలా తమ నిరసన వ్యక్తం చేశామంటున్నారు అర్ఎస్ఎస్ఎస్ సభ్యులు. కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయని ఇలా తమ నిరసనను వ్యక్తం చేశామంటున్నారు ఆ సభ్యులు.
 
‘రాయలసీమ నాలుగు జిల్లాలో సాగునీటి వసతిలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రాష్ట్రంలో కీలక స్థానాల్లో ఉన్న నేతలు ఈ ప్రాంతానికి చెందిన వారే. అయితే ఇక్కడ కేవలం 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న కారణంతో కోస్తాంధ్రా అభివృద్ధిపైనే దృష్టిసారిస్తున్నారు. సాయం చేయాల్సిన కేంద్రం కూడా ఇక్కడి రైతులను పట్టించుకోవటం లేదు. అందుకే తమ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకే ఇలా నిరసనను తెలియజేశాం’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles