TN Speaker Disqualifies 18 MLAs Loyal to Dinakaran పళనిస్వామి వ్యూహాత్మక అడుగు.. అసమ్మతిపై వేటు..

Turmoil in tamil nadu politics as 18 aiadmk mlas loyal to sasikala disqualified

Turmoil in Tamil Nadu politics, Tamil Nadu, AIADMK, TTV Dinakaran, ttv mlas disqualified, ttv dinakaran mlas disqualified, V.Shasikala, J,Jayalalithaa, CM Palaniswamy, pannerselvam, latest news, Tamil Nadu Politics

Tamil Nadu plunged into a huge political turmoil after 18 MLAs loyal to V Sasikala camp were disqualified by the Speaker P Dhanapal under 1986 Tamil Nadu Assembly Members party defection law.

పళనిస్వామి వ్యూహాత్మక అడుగు.. అసమ్మతిపై స్పీకర్ వేటు..

Posted: 09/18/2017 11:06 AM IST
Turmoil in tamil nadu politics as 18 aiadmk mlas loyal to sasikala disqualified

తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రత్యర్థుల వ్యూహాలకు అనుగూణంగా అధికారంలోని పళనిస్వామి ప్రభుత్వం శరవేగంగా ప్రతివ్యూహాలను వేస్తూ ముందుకు కదులుదుంది. రాష్ట్రంలోని అధికార ప్రభుత్వం రసకందాయంలో పడ్డిందని భావిస్తున్న క్రమంలో.. అటు అసెంబ్లీలోకి గుట్కా ఫ్యాకెట్లను తీసుకువచ్చి ప్రదర్శించిన 20 మంది డీఎంకే ఎమ్మెల్యేలపై వేటు వేసి.. విశ్వాస పరీక్షకు సిద్దం కానుందన్న నేపథ్యంలో.. పళనిస్వామి ప్రభుత్వం అత్యంత రాజకీయ చతురతను ప్రదర్శించి.. చిన్నమ్మ శశికళ వర్గానికి షాకిచ్చారు.

సరిగ్గా విశ్వాస పరీక్షకు వెళ్లనున్నారన్న తరుణంలో.. రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా రాష్ట్రానికి రానున్న తరుణంలో పళిని స్వామి ప్రభుత్వం.. వ్యూహాత్మకంగా అడుగువేసి టీటీవీ ధినకరణ్ కు మద్దతిస్తున్న 18 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసింది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ దన్ పాల్ పార్టీ విప్ ధిక్కరించిన 18 మంది ఎమ్మెల్యేను అనర్హులుగా ప్రకటించారు. పార్టీ నిర్ణయాలకు కట్టబడి వ్యవహరించకుండా.. వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకే ఈ చర్యకు పూనుకున్నట్లు ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

శశికళ వర్గాన్ని కోలుకోకుండా చేసే క్రమంలో పళని వర్గం వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో క్రితం రోజున దినకరణ్ వర్గంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన పళని స్వామి.. అమ్మ పెట్టిన పార్టీలో నేతగా ఎదిగి.. అదే పార్టీకి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. చివరకు ప్రత్యర్థి డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ తో చేతులు కలిపి.. పార్టీని బలహీనపర్చే చర్యలకు పాల్పడటం ఎంతవరకు సమంజమని నిలదీశారు. వెనువెంటనే ఇవాళ అసెంబ్లీ స్పీకర్ దినకరణ్ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.

మరోవైపు, స్పీకర్ నిర్ణయంపై దినకరణ్ వర్గీయులు భగ్గుమన్నారు. తాము ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డామో చెప్పకుండా స్పీకర్ ఏకపక్షంగా తమపై అనర్హత వేటును ఎలా వేస్తారని ప్రశ్నించారు. పార్టీ విప్ ధిక్కరించిన క్రమంలో షాకాజ్ నోటీసులు జారీ చేయకుండా, తమ సమాధానం వినకుండా స్పీకర్ తమను అనర్హులుగా ఎలా ప్రకటిస్తారని నిలదీస్తున్నారు. తమపై మోపబడిన నేరాలు నిర్థారణ కాకుండా ఎలా వేటువేస్తారని ప్రశ్నిస్తున్నారు. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని వారు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles