Will Vijayashanthi attend madras High Court today.? రాములమ్మకు శ్రీముఖాలు.. కోర్టుకు హాజరయ్యేనా..?

Will senior actress vijayashanthi obey high court directions

Vijayashanthi, Vijayashanthi news, Vijayashanthi latest news, Vijayashanthi high court, actress Vijayashanthi, south indian actress actress Vijayashanthi, actress Vijayashanthi case, Madras high court, land dispute, notices, Indir Chand Jain, Justice M V Muralidaran, mediation centre, crime

The Madras High Court has directed actress Vijayashanthi to appear before it on September 18 regarding referring a property dispute to the mediation centre for settlement.

రాములమ్మకు శ్రీముఖాలు.. కోర్టుకు హాజరయ్యేనా..?

Posted: 09/18/2017 10:42 AM IST
Will senior actress vijayashanthi obey high court directions

దక్షిణాది నటిగా, లేడి అమితాబ్ గా ఎదిగి.. నిన్నటి తరం మహిళలకు అదర్శప్రాయంగా మారిన సీనియర్ నటి విజయశాంతికి ఊహించని షాక్ ఎదురైంది. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్న విజయశాంతి.. ఇటీవల అటు తమిళనాడులో కూడా చిన్నమ్మ శశికళకు మద్దతుగా నిలిచారు. అర్కే నగర్ ఎన్నికలలో టీటీవి దినకరణ్ కు సపోర్టుగా ప్రచారాన్ని కూడా నిర్వహించారు. ఇలా తనకంటూ ఓ ప్రత్యకేత గుర్తింపును సాధించుకున్న విజయశాంతికి హైకోర్టు శ్రీముఖాలను జారీ చేసింది.

అమెను ఇవాళ హైకోర్టు అవరణలోని మీడియేషన్ కేంద్రానికి హాజరుకావాల్సిందిగా అదేశిస్తూ.. ఆ నోటీసులను పంపింది. అయితే ఈ నోటీసులు విజయశాంతికి అందాయా..? లేదా.? అమె ఇవాళ హైకర్టుకు హాజరవుతారా..? లేదా అన్నదే చర్చనీయాంశంగా మారింది. అసులు విజయశాంతికి హైకోర్టు నోటీసులను ఎందుకు జారీ చేసింది? అంటే ఆ మధ్య తమిళనాడులో వున్న తన అస్తుల విక్రయానికి సంబంధించి కేసులో న్యాయస్థానం అమెకు నోటీసులను జారీ చేసి.. ఇవాళ తన ఎదుట హాజరుకావాల్సిందిగా అదేశించింది.

ఈ కేసు వివరాల్లోకి వెళితే.. చెన్నై లోని ఎగ్మూర్ లో విజయశాంతి కి అప్పట్లో కొన్ని ఆస్తులు ఉండేవి అయితే ఆమె 2006 లో ఆ ఆస్తులను తనకు రూ.5.20 కోట్లకు అమ్మిందని, అయితే అదే ఆస్తులను ఆమె మరొకరికి కూడా అమ్మిందని ఇందర్ చంద్ జైన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అతని పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం నటి విజయశాంతికి నోటీసులను జారీ చేసింది. ఈ వివాదాన్ని ఇరువర్గాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోర్టు తెలిపింది. ఇరువర్గాలు హైకోర్టులోని మీడియేషన్ కేంద్రానికి హజరై సమస్యను పరిష్కరించుకోవాలని అదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles