terrorists target bangalore after delhi warns IB ఢిల్లీ తరువాత బెంగళూరే టార్గెట్.. ఐబీ హెచ్చరికలు

Terrorists target bangalore after delhi warns ib

Intelligence bureau, karnataka government, police, terrorists, ISIS, bangalore IT and software hub, delhi. Bengaluru. karnataka, crime

Intelligence bureau warns karnataka government and bengaluru police as terrorists target bangalore IT and software hub after delhi.

ఢిల్లీ తరువాత బెంగళూరే టార్గెట్.. ఐబీ హెచ్చరికలు

Posted: 09/18/2017 10:02 AM IST
Terrorists target bangalore after delhi warns ib

ఇండియన్ సాప్ట్ వేర్ కంపెనీల హబ్ గా పేరోందిన బెంగళూరును ఉగ్రవాదులు తమ టార్గెట్ గా చేసుకున్నారా..? అంటే అవునన్న సంకేతాలు వస్తున్నాయి. సాప్ట్ వేర్ రంగంలో అంచెలంచలుగా ఎదిగి.. అభివృద్దిలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఆ నగరాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారని... ఏ క్షణంలోనైనా దాడులు జరిపే అవకాశం ఉందని కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో, బెంగళూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. విదేశీ రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించింది.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో పాటు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, బంగ్లాదేశ్ ఉగ్రవాదులు దేశంలోని వివిధ ప్రాంతాలను టార్గెట్ చేశాయని... దేశ రాజధాని ఢిల్లీ తర్వాత బెంగళూరు వారికి ప్రధాన టార్గెట్ గా ఉందని తెలిపింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అందిన వెంటనే... ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోలీసు ఉన్నతాధికారులతో కీలక భేటీ నిర్వహించారు. మరోవైపు, కర్ణాటకలో 283 మంది బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నట్టు గత ఏడాది గుర్తించారు.

బెంగళూరులో స్విట్జర్లాండ్, శ్రీలంక, మాల్దీవులు, ఇటలీ, ఐర్లండ్, మంగోలియా, కెనడా, డెన్మార్క్, జపాన్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇథియోపియా తదితర దేశాలు కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు ఉన్నాయి. వీటితో పాటు, అంతర్జాతీయ విమానాశ్రయం, లెక్కలేనన్ని బహుళ అంతస్తుల భవనాలున్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో ఆ రాష్ట్రం హోం మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన ప్రదేశాల్లో చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles