maha ghani planted by cm kcr faded away in karimnagar సీఎం నాటిన మొక్కే వాడింది.. హరితహారం మాత్రం సక్సెస్

Maha ghani planted by cm kcr faded away in karimnagar

cm plant faded away in karimnagar, mahaghani plant faded in karimnagar, haritaharam, cm kcr, plant, maha ghani, maneru, forest officials, negligence, karimnagar

maha ghani plant by cm kcr on the occassion of 3rd phase launch of haritha haram faded away in karimnagar, due to the negligence of forest officials.

సీఎం నాటిన మొక్కే వాడింది.. హరితహారం మాత్రం సక్సెస్

Posted: 09/16/2017 05:31 PM IST
Maha ghani planted by cm kcr faded away in karimnagar

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమం విజయవంతం అయ్యిందని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంటే.. నాటిన మొక్కలన్నీ చెట్లుగా ఎదుగుతున్నాయని ఇటు అటవీ శాఖ అధికారులు కూడా లెక్కలు చెప్పడం ఇప్పటి వరకు నిజమనే నమ్మశారు తెలంగాణ వాసులు. అయితే ఈ లెక్కలలో కొన్ని తప్పుడు లెక్కలు కూడా వున్నాయన్నిది తాజాగా నిరూపితం అయ్యింది. ఏకంగా ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు తన స్వహస్తాలతో నాటిన మొక్క వాడిపోవడంతో ఈ నిజం వెలుగుచూసింది.

కరీంనగర్ జిల్లా మానేర్ కట్ట దిగువన మహాఘని మొక్కను కేసీఆర్ మూడవ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా నాటారు, అయితే ఆ మొక్కను చెట్టుగా వృద్ది అయ్యేవరకు దాని బాగోగులు చూసుకోవాల్సిన అధికారులు మాత్రం నిద్రవావస్థలోకి జారుకున్నారు. హరితహారంలో బాగా అలసిపోయినట్లు వున్నారు. అంతే అలా నిద్రలోకి జారుకున్నారో లేదో ఇలా ఏకంగా మహాఘని మొక్క వాడిపోయింది, దీన్ని ఎలా బతికించాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

దీనికి సంబంధించి కాపలాదారు ఓ కథనం వినిపిస్తున్నాడు. ఈ నెల 9వ తేదీ రాత్రి పది గంటల తర్వాత మూడు ద్విచక్రవాహనాలపై ఐదారుగురు వచ్చారని... వారంతా ఈ మొక్క వద్ద నిలబడి ఏదో చేస్తున్నట్టు తనకు అనిపించిందని... వారి వద్దకు వెళ్లి ప్రశ్నించగా, తనను తిడుతూ వారు వెళ్లిపోయారని అతను చెప్పాడు. ఈ విషయాన్ని వెంటనే బల్దియా పర్యవేక్షకుడికి చెప్పానని తెలిపాడు. అయితే, ఆ రోజు నుంచి ఆ మొక్క క్రమంగా వాడిపోవడం మొదలైందని చెప్పారు. మరోవైపు, ముఖ్యమంత్రి నాటిన మొక్క పరిస్థితే ఇలా ఉంటే... ఇతర మొక్కల పరిస్థితి ఏమిటని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : haritaharam  cm kcr  plant  maha ghani  maneru  forest officials  negligence  karimnagar  

Other Articles