lokesh says he Rs.10 Cr to YS Jagan constituency జగన్ అడగకపోయినా.. లోకేష్ రూ. 10 కోట్లు ఎందుకిచ్చాడు..?

Nara lokesh says tdp government granted rs 10 cr to ys jagan constituency

nara lokesh, chandrababu naidu, YS Jagan, pulivendula, Anna Ramachandra reddy, giddalur, Ashok Reddy, development funds

Andhra pradesh IT Minister nara lokesh says his tdp government granted Rs.10 Cr to YS Jagans pulivendula constituency.

జగన్ అడగకపోయినా.. లోకేష్ రూ. 10 కోట్లు ఎందుకిచ్చాడు..?

Posted: 09/13/2017 08:20 PM IST
Nara lokesh says tdp government granted rs 10 cr to ys jagan constituency

రాష్ట్రాభివృద్దిలో భాగంగా నియోజకవర్గాలను కూడా అభివృద్ది చేయాలన్న అంకితభావంతో అన్ని నియోజకవర్గాలతో పాటు విపక్ష నేతల నియోజకవర్గాలకు కూడా నిధులు కేటాయిస్తున్నామని అంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ వాఖ్యనించడం చర్చనీయాంశంగా మారింది. అన్ని నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేసినప్పుడు ప్రత్యేకంగా విపక్ష సభ్యులకు కూడా నిధులను మంజూరు చేస్తున్నామని చెప్పడంలో అంతర్యమేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతే అధికార, విపక్షాలకు మధ్య తేడా ఉందని ప్రభుత్వవైఖరిని అయన ప్రస్పూటిస్తున్నారా..? అని విపక్ష్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

విజయనగరంలో జిల్లాలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాంలో పాల్గోన్న ఆయన పార్టీ పరంగా వ్యాఖ్యలు చేయాల్సింది పోయి.. ప్రభుత్వ పాలనాపరమైన వ్యాఖ్యలను చేయడం ఏంటని విపక్షనేతలు నిలదీస్తున్నారు. లోకేష్ కు ఎక్కడ ఏం మాట్లాడాలోకూడా తెలియని అపరిపక్వతస్థితి అంటూ మండిపడ్డారు. ఇక తమ పార్టీ అధినేత జగన్ అడగకపోయినా.. ఆయన నియోజకవర్గానికి రూ. 10 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని ప్రకటించుకోవడంలో లోకేష్ అంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.

తమ ప్రభుత్వ పారదర్శకమైనదని తమకు తాము గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి.. తన పార్టీ నుంచి గత నెల మొదటివారంలో ఎందుకు రాజీనామా చేసి వెళ్లారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు వెళ్తూ వెళ్తూ.. టీడీపీ ప్రభుత్వంపైనా.. పార్టీ పైనా ఏమేమి విమర్శలు చేశారో నారా లోకేష్ తెలుసుకోవాలని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అసలు లోకేష్ ఏమన్నారంటే.. జగన్ అడగకపోయినా... ఆయన నియోజకవర్గం పులివెందులకు రూ.  10 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles