Accused and three minors taken into police custody పెళ్లి చేసుకోమ్మని ఒత్తిడి చేసినందుకే..

Chandini jain murder accused and three minors taken into police custody

chandini jain, Intermiediate student, my hot, sai kiran, super senior, murder, ameenpur, pub tag, sangareddy, deepthisrinagar, miyapur police station, crime, hyderabad blue whale suicide, latest news

After finding the CCTV footage of Chandini and her friend near Ameenpur, police were able to catch hold of the friend Sai Kiran Reddy and three minors with the help of the auto driver.

పెళ్లి చేసుకోమ్మని ఒత్తిడి చేసినందుకే..

Posted: 09/13/2017 11:45 AM IST
Chandini jain murder accused and three minors taken into police custody

తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టించిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని చాందిని హత్యకేసులో మిస్టరీని చేధించిన పోలీసులు.. అమె ప్రియుడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా, తానే చాందినిన చంపానని అంగీకరించాడు. తనను పెళ్లి చేసుకోమ్మని గత కొంతకాలంగా వేధిస్తున్న క్రమంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామని చెప్పినా వినిపించుకోని చాందిని.. తనను వత్తిడి చేసిందని.. దీంతో ఈ విషయమై చర్చించేందుకు నిత్యం వెళ్లే అమీన్ పూర్ గుట్టల్లోకి తీసుకెళ్లానని చెప్పాడు. అయితే చాందినిని తాను చంపాలని అనుకోలేదని.. క్షణికావేశం వల్లే ఈ హత్య జరిగిందని సాయికిరణ్ చెప్పాడు.

అసలు అమీన్ పూర్ గట్టల్లో ఎం జరిగిందంటే...?

అమీన్ పూర్ నిర్జన ప్రాంతానికి వెళ్లిన తామ మధ్య మరోమారు పెళ్లి విషయం చర్చకు వచ్చిందని సాయికిరణ్ పోలీసులకు తెలిపాడు. అయితే ఇప్పుడే తాను పెళ్లి చేసుకోలేనని, సెటిల్ అయిన తరువాత తప్పక పెళ్లి చేసుకుంటానని చెప్పానని, అయినా వినని చాందిని తనతో వాగ్వాదానికి దిగిందని, దీంతో చేసేది లేక తాను చాందినిని చెంపపై కొట్టానని వెల్లడించాడు. దీంతో చాందిని బిగ్గరగా అరవడం మొదలుపెట్టిందని.. ఈ ఆకస్మాత్తు చర్యతో తాను చాందిని గొంతు నులిమానని.. ఇంతలో అమె పడిపోయిందని, తన స్నేహితులు వచ్చి తనతో చాందని చనిపోయిందని చెప్పారని.. ఇదంతా అమీన్ పూర్ కు వెళ్లిన ఐదు నిమిషాలలోనే జరిగిపోయిందని నిందితుడు చెప్పాడు.

సీన్ రికస్ట్రక్షన్ ద్వారా ఏం తెలిసింది..?

అయితే తమదైన స్టైయిల్ లో విచారించిన పోలీసులు.. సీన్ రికస్ట్రక్షన్ లో మరిన్ని అసక్తికర విషయాలను తెలుసుకున్నారు. చాందినిన వదిలించుకునే ప్రయత్నం చేసిన సాయికిరణ్.. అమెను గత అరు మాసాలుగా దూరంగా పెట్టినా.. అమె వెంటపడటం మానలేదు. దీంతో చాందినిని అంతం చేయడం తప్ప మరోమార్గం లేదని భావించిన సాయి కిరణ్ అమెను ఈ నెల 9న సాయంత్రం ఐదు గంటలకు అమీన్ పూర్ గుట్టల్లోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య పెళ్లి టాపిక్ వచ్చింది.

దీంతో అమెను కొట్టాడు., అమె కేకలు వేయగానే గొంతు నులిమాడు. ఇక తన పథకం ప్రకారం అమెను అంతం చేసేందుకు తలపై, మెడపై బలంగా కొట్టాడు. అమె చనిపోలేదన్న అనుమానంతో అమెను బలంగా లోయలోకి తేసేశానని సాయికిరణ్ పోలీసులకు తెలిపాడు. చాందని లోయలో ఎలా పడిందన్న పోలీసుల ప్రశ్నతో ఈ విషయాన్ని చెప్పాడు సాయికిరణ్. తామిద్దరం 9వ తరగతి నుంచి ఒకరినోకరుం ఇష్టపడుతున్నామన్నారు.

అయితే ఎన్నడూ నేరం చేయనివాడు నేరానికి పాల్పడితే.. అతనిలో భయం అవహించి.. నిజాలను చెప్పేస్తాడు. కానీ సాయికిరణ్ లో నేరప్రవృత్తి రక్తంలోనే వున్నట్లుంది. అందుకనే తనపై ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా చాందిని కనిపించడం లేదని అమె తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేసిన తరువాత తనకేమీ తెలియనట్లు.. ఏకంగా వారింటికి వెళ్లి మరీ పరామర్శించి రావడం..  చాందిని కుటుంబ సభ్యులను కలవడం.. మాత్రం అటు పోలీసులను, ఇటు చాందిని తల్లిదండ్రులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles