Petrol price hiked by Rs 7.29 since July 1 ఇదేమీ సర్కారో.. నొప్పి తెలియకుండా ఇంధన వాత..

Petrol price hiked by rs 7 29 since july 1 inches closer to rs 80

Daily price revision, Petrol price, diesel price, Delhi, Petrol price Mumbai, Petrol price Delhi, Petrol price Bengaluru, petrol price today, diesel price Mumbai, diesel price Delhi, diesel price Bengaluru, excise duty on petrol, VAT, GST, tax, excise

Petrol and diesel prices have gone through the roof ever since the central government announced daily revision of fuel prices.

ఇదేమీ సర్కారో.. నొప్పి తెలియకుండా ఇంధన వాత..

Posted: 09/13/2017 11:07 AM IST
Petrol price hiked by rs 7 29 since july 1 inches closer to rs 80

దేశవ్యాప్తంగా ఒక పన్ను విధానాన్ని తీసుకువచ్చిన కేంద్రం జీఎస్టీ పేరుతో ప్రజల సోమ్మును కొల్లగోడుతూనే వుంది. అన్నింటికీ వర్తించే జీఎస్టీ ఇంధనంపై మాత్రం వర్తించకుండా దానిపై మాత్రం అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు ఎక్సైజ్ డ్యూటీలను విధిస్తూ.. వ్యాట్ కూడా అమలు చేస్తూ.. ప్రజల సొమ్మను మాత్రం జుర్రన పీల్చేస్తున్న కేంద్రం.. జూలై మాసం నుంచి అమల్లోకి తీసుకువచ్చిన నూతన విధానంతో రోజువారీగా ధరల పెంపు నిర్ణయంతో.. ప్రజలకు స్లో పాయిజన్ మాదిరిగా అలవాటు చేసి వారి జేబులను గుల్ల చేస్తుంది.

పక్షం రోజలకో పర్యాయం ఇంధన ధరలను సమీక్షించే విధానానికి స్వస్తి పలికిన కేంద్రం.. రోజువారీ విధానంతో ప్రజలు ధరలెంత పెరిగినా పట్టించుకోరని తెలిసే ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుందన్న అనుమానాలు వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో లభ్యమయ్యే క్రూడ్ అయిల్ ధర బ్యారెల్ కు ఏకంగా వంద డాలర్లకు చేరుకున్న నేపథ్యంలో పక్షం రోజులకు రెండు, మూడు రూపాయలు మేర అప్పటి యూపీఏ ప్రభుత్వం ధరలను పెంచితే ధర్నాలు, రాస్తారోకోలతో దేశవ్యాప్తంగా అందోళన బాట పట్టిన ఏన్డీఏ పక్షాలు.. అప్పటి కేంద్ర ప్రభుత్వం తక్షణ పెంపు ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.

ఇక అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు మాత్రం అంతర్జాతీయంగా ధరలు తగ్గినా.. ఇంధన ధరలను మాత్రం పెంచుతూ ఏకంగా ముంబై మార్కెట్ లో రూ.80కు చేరుకునేలా చేసింది. జూలై ఒకటో తేదీన ఇదే లీటర్ పెట్రోల్ రూ.66.93, డీజిల్ రూ.58.09గా ఉంది. రెండు నెలల్లో పెట్రోల్ ఏడున్నర రూపాయలు, డీజిల్ ఐదున్నర రూపాయలు పెరిగింది. ప్రతి రోజూ కనీసంగా పైసా నుంచి 15 పైసల వరకు పెరుగుతూ ఉంది. బహిరంగ మార్కెట్ అనుగుణంగా మారుతున్న ధరలతో హైదరాబాదులో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ 75 రూపాయలకు దగ్గరలో ఉండగా, లీటరు డీజిల్ ధర రూ.63.69 ఉంది.

అయినా ఇదంతా అంతర్జాతీయ మార్కెట్లకు అనుగూణంగానే జరుగుతుందన్న కథలను దేశప్రజలకు వినిపిస్తున్న కేంద్రప్రభుత్వం.. వారి పర్సులకు చిల్లులు పెడుతోంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిరాగానే స్వచ్ఛాబారత్ సెస్సు, మహిళా శిశు కళ్యాన్ అంటూ ఒక్క శాతం మేర పన్నులు అధికంగా వసూలు చేసిన కేంద్రం.. ఇటు వాహనదారులపై కూడా పెనుభారాన్ని మోపారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలకు అనుగూణంగానే ధరలను పెంచుతున్నామని చెప్పిన కేంద్రం.. లీటరు పెట్రోల్ పై రూ.11.77 మేర.. లీటరు డీజిల్ పై 13.47 మేర గతంలో లేని విధంగా ఎక్సైజ్ డ్యూటీని పెంచి వాతపెట్టారు.

అయితే తాజాగా పెరుగుకుతున్న ఇంధన ధరల నేపథ్యంలో కేంద్రం గతంలో విధించిన ఎక్సైజ్ డ్యూటీలో కొంత మేర విధిల్చి వాహనదారులపై భారం పడకుండా చర్యలు తీసుకుంటుందా..? అన్న ప్రశ్నలకు కేంద్ర ఇంధనశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ మాత్రం ఇప్పుడప్పుడే ప్రభుత్వానికి అలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని, అయితే పరిస్థితులు ఉత్పన్నమయ్యితే ప్రధాని నరేంద్రమోడీతో చర్చించిన పిమ్మట ఆలాంటి నిర్ణయం తీసుకునే అవకాశముంటుందని వెల్లడించడంతో.. ఇక వాహనదారులకు ఇంధన కష్టం ఇప్పుడప్పుడే తీరేలా కనిపించడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles