chandini "My hot" the culprit behind her murder case ఇంటర్ విద్యార్ధిని హత్యకేసును చేధించిన పోలీసులు

Police chased inter girl chandini murder case within 24 hours

chandini jain, Intermiediate student, my hot, sai kiran, super senior, murder, ameenpur, pub tag, sangareddy, deepthisrinagar, miyapur police station, crime, hyderabad blue whale suicide, latest news

Chandini my hot is the culprit behind her murder case, cyberabad police chased the case within 24 hours after her body was found amidst boulders in baren area of Ameenpur village on Tuesday morning.

ఇంటర్ విద్యార్ధిని హత్యకేసును చేధించిన పోలీసులు

Posted: 09/13/2017 09:34 AM IST
Police chased inter girl chandini murder case within 24 hours

హైదరాబాదుతో పాటు యావత్ తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టించిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని చాందిని హత్యకేసును పోలీసులు ఛేదించారు. చాందినీ సెల్ ఫోన్ అధారాంగా ఈ కేసును చేధించారు పోలీసులు. చాందిని ఫోన్ లో ఓ నెంబర్ ను అమె మై హాట్ అని సేవ్ చేసుకుంది. అదే నెంబరుపై అనుమానంతో విచారణ సాగించిన పోలీసులు మై హాట్ నెంబరు సాయికిరణ్ అనే అమె ప్రియుడిదేనని తెలుసుకుని అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, తానే ఈ హత్యకు పాల్పడినట్లు సైబరాబాద్ పోలీసులు నిర్ధారించారు.

పెళ్లి విషయంతో చాందినీ నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది... అయితే పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టంలేని కారణంగానే పథకం ప్రకారం ఆమెను హత్య చేశానని సాయిచరణ్ విచారణలో వెల్లడించాడని పోలీసులు తెలిపారు. మియాపూర్ లోని మదీనాగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న సాయికిరణ్ అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ కేసులో అసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ముందస్తుగా వేసుకున్న పథకంలో భాగంగానే చాందినిని నగర శివారు అమీన్ పూర్ గుట్టల్లోకి తీసుకెళ్లి దారుణంగా హతమార్చాడని తేల్చారు. అయితే ఆ సమయంలో ఆమెపై అత్యాచారం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.

చాందిని, సాయికిరణ్ గత రెండేళ్లుగా ఒకరినోకరు ఇష్టపడుతున్నారు. మంచి మిత్రులుగా వున్న వీరి మధ్య ప్రేమ చిగురించింది. 2015 నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. అయితే మోజు తిరిందో ఏమో కానీ గత అరు నెలలుగా చాందినీని సాయికిరణ్ దూరం పెడుతు వస్తున్నాడు. ఇది ఇష్టంలేని చాందిని సాయికిరణ్ వెంటపడుతుంది. అంతేకాకుండా తనను పెళ్లి చేసుకోవాలని కూడా ఒత్తడి తీసుకువచ్చింది. దీంతో అమెను ఎలాగైన వదిలించుకోవాలన్న సాయికిరణ్ ఈ విషయంపై మాట్లాడాలని చెప్పి ఈనెల 9న అమీన్ పూర్ గుట్టల్లోకి తీసుకెళ్లి హత్య చేశాడు.

అయితే నేరప్రవృత్తి వంట్లోనే వుందో.. లేక ప్రవహించే రక్తంలోనే వుందో.. లేక సినిమాలు, సీరియళ్ల ప్రభావమో తెలియదు కానీ.. చాందినిని హత్యచేసిన తర్వాత కూడా సాయికిరణ్ చాందిని ఇంటికి వెళ్లాడు. తనపై ఎలాంటి అనుమానం రాకుండా చాందిని కుటుంబ సభ్యులను కలిశాడు. తమ బిడ్డకి మంచి స్నేహితుడిగా ఉండే సాయికిరణ్ ఈ హత్య చేశాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని చాందిని తల్లి విలపించారు. ఇష్టం లేకపోతే తన కూతురును వదిలేయాలి కానీ ఇలా నమ్మించి.. నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి విగతజీవిగా మారుస్తారా..? అంటూ కన్నీళ్లపర్యంతమయ్యంది.

ఈ హత్యను సాయికిరణ్ ఒక్కడే చేసి ఉండడని… ఇంకా ఎవరైనా ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాయికిరణ్ తనకు చేతికి దోరికితే చంపేస్తానని అగ్రహాన్ని వ్యక్తం చేసింది. చిన్నవయస్సులోనే ఇంతటి దారుణానికి పాల్పడిన నేరగాడ్ని ఘటనాస్థాలానికి తీసుకెళ్లి ఎన్ కౌంటర్ చేయాలని కోరుతుంది. కాగా, మియాపూర్ పోలీసులు సాయికిరణ్ ను ఘటనాస్థాలానికి తీసుకెళ్లి ఎలా హత్య చేశాడన్న సీన్ రికస్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం పోలీసులు సాయికిరణ్ ను అరెస్టు చేసి మీడియాకు ముందు ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్ కు తరలించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh