Lodha Meridian Flat Residents Vs Lodha Bellezza Owners రెండుగా చీలిన లోధా గృహసముదాయాల ఓనర్లు..

Lodha flat residents protest continues at ghmc head quarters

Lodha Flat Residents Protest, Lodha Meridian Flat Residents, Lodha Bellezza Owners, GHMC Commissioner office, police action, 8 members, lodha builders, kukatpally

After bellezza owners now it is the turn of Lodha Meridian Flat Residents who protest against builders in front of GHMC Commissioner office.

ITEMVIDEOS: రెండుగా చీలిన లోధా గృహసముదాయాల ఓనర్లు..

Posted: 09/12/2017 06:30 PM IST
Lodha flat residents protest continues at ghmc head quarters

హైదరాబాద్ లోని హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో హై ఎండ్ ఫ్లాట్స్ నిర్మించిన లోధా బిల్డర్స్.. అటు అధికాదాయ వర్గాలకు, ఇటు మధ్యస్థాయి ఉన్నతాదాయ వర్గాలకు మధ్య పేచి పెట్టింది. తమకు లోధా బిల్డర్స్ అన్యాయం చేసిందని ఇటీవలే.. సినీనటుడు జగపతిబాబు సహా లోధా బెలెజ్జా ఫ్లాట్ల ఓనర్లు బిల్డర్ పై తీవ్రస్థాయిలో అగ్రహం వ్యక్తం చేసిన తరువాత.. ఇప్పడు ఆ వంతు లోధా మెరీడియన్ గృహసముదాయంలోని ఓనర్లు వచ్చింది. తమకు అగ్రిమెంట్ చేస్తున్న సమయంలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా బిల్డర్ పూర్తి చేయలేదని మండిపడుతున్నారు. దీంతో లోధా గృహసముదాల ఓనర్లు రెండుగా చీలిపోయారు.

వివరాల్లోకి వెళ్తే.. కూకట్ పల్లిలో నిర్మించిన లోధా బిల్డర్స్ పక్కపక్కనే రెండు వెంచర్లను వేర్వేరుగా నిర్మించారు. గేటెడ్ కమ్యూనిటీ పేరుతో నిర్మించిన ఈ రెండు వేర్వేరు వెంచర్లలోని ఫ్లాట్ల ధరలు కూడా వేరు. బెలెజ్జ పేరుతో హైఎండ్ అపార్టుమెంట్లను నిర్మించిన లోధా వాటి ధరను మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు నిర్ధారించి అమ్మాకాలను కూడా చేశారు. వాటిలోనే సినీనటుడు జగపతిబాబు, నటి శ్రీయ సహా పలువురు ప్రముఖులు ఫ్లాట్లను కొన్నారు.

కాగా దీనికి పక్కనే మెరిడియన్ పేరుతో మరో అపార్టుమెంట్లను నిర్మించిన లోధా దానిని మధ్యఉన్నతవర్గదాయం గల వారిని టార్గెట్ చేసుకుని విక్రయించింది. అయితే ఈ రెండు అపార్టుమెంట్ల మధ్య అడ్డుగా వున్న ప్రహరీ గోడను తొలగించి.. తమకు అనువుగా లోనికి వచ్చేమాదిరిగా ఏర్పాటు చేయాలని మెరిడియన్ ఫ్లాట్ ఓనర్లు డిమాండ్ చేస్తుండగా, కాంపౌండ్ వాల్ తొలగిస్తే.. మాకు ప్రైవసీ ఎలా వుంటుంది.. గేటెడ్ కమ్యూనిటీ ఎలా అవుతుందని బెలెజ్జా అపార్టుమెంటు యజమానులు ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంలో తెల్చుకునేుందుకు మెరిడియన్ వాసులు ఇవాళ కమీషనర్ కార్యాలయానికి బస్సుల్లో రాగా, వారిని పోలీసులు అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. అయితే రెండు అపార్టుమెంట్లలో ఫ్లాట్లను కోనుగోలు చేసిన యజమానులకు వేర్వేరుగా హామీలిచ్చిన బిల్డర్ పై అటు మెరిడియన్, ఇటు బెలెజ్జ వాసులు అరోపణలు గుప్పిస్తున్నా.. చర్యలకు ఉపక్రమించడంలో మాత్రం అధికారులు మీనమేషాలు లెక్కపెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  PM candidate  Berkeley  US  Narendra Modi  demonetisation  politics  

Other Articles

 • Rich women turned beggers in hyderabad in movie style

  ‘బిచ్చగాడు’ సినిమాను తలపిస్తున్న రిచ్ బెగర్స్..

  Nov 21 | అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతరు ఇవాంక ట్రంప్ హైదరాబాద్ నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో నగరాన్ని యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. ఎక్కడ యాచకుటు కనపించినా వారిని జైళ్లకు తరలించేస్తున్నారు.... Read more

 • Manushi chhillar became miss world because of modi shiv sena s latest dig

  బీజేపి, ప్రధానిపై శివసేన ’’చిల్లర్’’ వ్యంగాస్త్రం..

  Nov 21 | అమెరికాకు చెందిన మూడీస్ సంస్థ ఇటీవల మన దేశ అర్థిక పురోగతి అంశానికి సంబంధించి.. ర్యాంకును భారీగా పెంచడంతో.. అది తమ ప్రభుత్వ గొప్పదనంగా చెప్పుకున్న పాలకపక్షానికి.. అందులో భాగస్వామ్యంగా కొనసాగుతున్న పార్టీ వ్యంగాస్త్రాలను... Read more

 • Gurgaon s fortis bills rs 16 lakhs to family of 7 yr old dengue victim

  కార్పోరేట్ మార్క్ దోపిడి.. పక్షం రోజులకు.. రూ.16 లక్షల బిల్లు.. అయినా

  Nov 21 | వైద్యో నారాయణ హరి’ అని, వైద్యుడు దేవుడితో సమానమనివారిని అశ్రయించే రోగులు, వారి బంధువులు బావిస్తున్నా.. రోగులును మాత్రం వైద్యులు మనుషులన్న విషయాన్ని కూడా మర్చిపోయి.. కేవలం వారి నుంచి ఎంతమేరకు సాధ్యమైతే అంతవరకు... Read more

 • Aliens birds found in vizag consuming only its mother bought food

  ITEMVIDEOS: ఈ వింత పక్షులు.. అమ్మ తెచ్చిన అహారమే తింటున్నాయి..

  Nov 21 | విశాఖపట్నంలోని నిర్మాణంలో ఉన్న భవనంలో వింత అకారంలో వున్న పక్షలు తమ గొప్పతనాన్ని చాటుకుంటున్నాయి. ఇప్పటి వరకు భూమిపై ఇలాంటి తరహా జీవులను చూడకపోవడంతో.. వింత జీవులుగా పరిగణిస్తూ వీటిని చేసేందుకు స్థానికులు అసక్తిని... Read more

 • Hyderabad metro phase 1 set to get operational from miyapur to metuguda

  మెట్రో రైల్ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు..

  Nov 20 | హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. ఎస్‌ఆర్‌నగర్‌- మెట్టుగూడ మధ్య రైళ్ల రాకపోకలకుసంబంధించి మెట్రోరైల్‌ భద్రతా కమిషనర్‌ (సీఎంఆర్‌ఎస్‌) అనుమతి లభించింది. మూడు రోజుల పాటు నిర్వహించిన తనిఖీల అనంతరం... Read more

Today on Telugu Wishesh