Rahul Gandhi Ready to be PM Candidate in 2019 బరిలోకి దిగేందుకు నేను రెడీ.. అంటున్న రాహుల్

Rahul gandhi absolutely ready to be pm candidate for 2019

Rahul Gandhi, 2019 Lok Sabha elections, Berkely, Jawaharlal Nehru, Prime Minister Narendra Modi, Rahul Gandhi, Rahul Gandhi in Berkely, PM candidate, Berkeley, US, Narendra Modi, demonetisation, politics

Congress vice-president Rahul Gandhi has declared he is "absolutely ready" to be the party's prime ministerial candidate for the 2019 general elections.

బరిలోకి దిగేందుకు నేను రెడీ.. అంటున్న రాహుల్

Posted: 09/12/2017 05:02 PM IST
Rahul gandhi absolutely ready to be pm candidate for 2019

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థిగా తాను బరిలోకి దిగేందుకు సిద్దమని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సంకేతాలిచ్చారు. ప్రధాని అభ్యర్థిగా మీరు బరిలోకి దిగుతారా..? అన్న ప్రశ్నకు.. ఆయన స్పందిస్తూ.. నేను ప్రధాని పదవికి పోటీ చేసేందుకు సిద్దంగా వున్నాను. అయితే మాది సంస్థాగత పార్టీ కాబట్టి.. ఏ నిర్ణయమైన వ్యక్తి కాకుండా పార్టీ తీసుకుంటుందని అన్నారు. ప్రస్తుతం పార్టీలో దీనిపై చర్చలు జరుగుతున్నాయిని చెప్పిన ఆయన.. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, పార్టీ అదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని చెబుతూ సంకేతాలను ఇచ్చారు.

కాగా వారసత్వ రాజకీయాలపై అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన సమాధానమిచ్చారు. తాను మాత్రమే వారసత్వంగా రాజకీయాల్లోకి రాలేదని, దేశంలో అనేక రాజకీయ పార్టీల్లోనూ ఇదే పద్దతి కొనసాగుతుందని అన్నారు. అఖిలేష్ యాదవ్, స్టాలిన్ సహా అనేక మంది, ఇటు సినీపరిశ్రమలోనూ అభిషేక్ బచ్చన్, అటు వాణిజ్య రంగంలో అంబానీ సోదరులు ఇలా అనేక మంది వారసత్వంగానే వచ్చారని చెప్పుకోచ్చారు. ఎలా వచ్చామన్నది ముఖ్యం కాదని, అయితే దేశ ప్రజలకు ఎంత మేరకు సేవ చేశామన్నదే ముఖ్యమని రాహుల్ గాంధీ అన్నారు.

రెండు వారాల పర్యటన నిమిత్తం అమెరికా పర్యటనకు వచ్చిన ఆయన.. ఇక్కడ బెర్క్ లీలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఈ సందర్భంగా ‘ఇండియా ఎట్‌ 70: రిఫ్లెక్షన్స్‌ ఆన్‌ ది పాత్‌ ఫార్వర్డ్‌’ అనే అంశంపై ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. విభజన రాజకీయాలు ప్రజలను వేరుచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచే కాశ్మీర్ లో అరచకశక్తులు పేట్రేగిపోతున్నాయని.. వాటి కట్టడిలో కేంద్రం పూర్తిగా విఫలమైందని అరోపించారు.

ఈ సందర్భంగా జీఎస్‌టీ, పెద్ద నోట్ల రద్దుపై కూడా రాహుల్‌ ప్రసంగిస్తూ.. ఏ లక్ష్యాలను నిర్ధేశించుకుని కేంద్రప్రభుత్వం ఈ చర్యలను చేపట్టిందో.. అవి మాత్రం నేరవేరలేదని దుయ్యబట్టారు. కాగా, మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల భారత ఆర్థిక వృద్ధిరేటు తగ్గిపోతోందని అవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి, రైతులకు తీరని నష్టం వాటిల్లుతోందని రాహుల్‌ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్‌ ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. కాలిఫోర్నియాలో పర్యటన ముగించుకుని లాస్‌ ఏంజిల్స్‌కు వెళ్లనున్నారు. ఆ తర్వాత వాషింగ్టన్‌, న్యూయార్క్‌ల్లో పర్యటించి ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  PM candidate  Berkeley  US  Narendra Modi  demonetisation  politics  

Other Articles