intermediate girl found dead in ameenpur at hyderabad విద్యార్థిని అదృశ్యం విషాదంతం.. నిర్జనప్రాంతంలో..

Intermediate girl found dead in ameenpur police probe blue whale links

chandini jain, Intermiediate student, blue whale challenge, murder, ameenpur, pub tag, sangareddy, deepthisrinagar, crime, blue whale, blue whale challenge, blue whale game, blue whale suicide, blue whale deaths, blue whale suicide india, hyderabad blue whale suicide, latest news

The body of a 17-year-old girl who was reported missing on Saturday night was found amidst boulders in baren area of Ameenpur village on Tuesday morning.

విద్యార్థిని అదృశ్యం విషాదంతం.. నిర్జనప్రాంతంలో..

Posted: 09/12/2017 10:22 AM IST
Intermediate girl found dead in ameenpur police probe blue whale links

హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగింది. నగరంలో ఇంటర్ విద్యార్ధిని అదృశ్యమైన ఘటన విషాదంతంగా ముగిసింది. స్నేహితులతో కలసి పార్టీ చేసుకుని వస్తానని చెప్పి వెళ్లిన 17 ఏళ్ల చాందిని జైన్‌ అనే విద్యార్థిని అమీన్ పూర్ కొండల్లోని నిర్జన ప్రాంతంలో శవమై కనిపించింది. అయితే చాందిని జైన్ వంటిపై ఎలాంటి గాయాలు కాలేదని పోలిసులు నిర్ధారించినా.. గొంతునులిమి హత్య చేశారా..? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. హత్యచేసి అమె మృతదేహాన్ని గుట్టల్లో పడవేశారా...? అమెపై అఘాయిత్యం జరిపారా..? అన్న కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
వివరాల్లోకి వెళ్తే మియపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని దీప్తిశ్రీనగర్.. సత్యనారాయణ ఎనక్లేవ్ లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త కిషోర్ జైన్ కుమార్తె చాందిని జైన్. బాచుపల్లిలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుంది. శనివారం కాలేజి నుంచి వచ్చిన తరువాత స్నేహితులతో కలసి పార్టీ చేసుకుంటానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన చాందిని సాయంత్రం చీకటిపడుతున్నా ఇంకా ఇంటికీ చేరుకోలేదు. కంగారుపడిన తల్లిదండ్రులు అమె మొబైల్ నెంబర్ కు ఫోన్ చేశారు. అది కాస్తా స్విచ్ఛాప్ వచ్చింది.
 
దీంతో అందోళనకు గురైన వారు వెంటనే స్థానిక మియాపూర్ పోలిస్ స్టేషన్ కు వెళ్లి తమ కూతురు కనిపించడం లేదని పిర్యాదు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. అమె సెల్ ను ట్రాక్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజుల తరువాత నిన్న సాయంత్రం కొందరు భవన నిర్మాణ కూలిలు అడపిల్ల శవం గుట్టల్లో పడిందని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇవాళ వేకువ జామునే చేరకున్న పోలీసులు అమెను చాందినీ జైన్ గా గుర్తించారు. ఆమెను హత్య చేసి కొండల్లో పడేశారని తేల్చిన పోలీసులు, అత్యాచారానికి గురైందా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.

చాందిని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె పార్టీ చేసుకుంటానని వెళ్లిన స్నేహితుడు ఎవరన్న విషయమై పోలీసులు కూపీ లాగుతున్నారు. అమె చేతికి పబ్ ట్యాగ్ కూడా వుందని పోలీసులు వెల్లడించారు. స్నేహితుడే ఈ దారుణానికి ఒడిగట్టాడా? లేదా మరెవరైనా ఉన్నారా? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతుంది. కాగా చాందిని మృతదేహం కూడా కళ్లిపోయే దశకు చేరుకోవడంతో అమెను 9వ తేదీనే హత్యాచేసి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కుమార్తె మరణంతో ఆ కుటుంబం శోక సంద్రంలో నిండిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles