congress leader arrested in jadcherla పక్కింటిమీద కాంగ్రెస్ నేత నజర్.. పాడుపని చేసి..

Congress leader ramachandra reddy arrested in jadcherla

Congress leader, ramachandra reddy, vema reddy, jadcherla, retired head constable, house, harassment, neighbours house, mahaboobnagar, srisailam highway, real bhoom, crime

jadcherla congress leader arrested for throwing stools in front of neighbours house, who repeatedly failed in acquring it as the house owners downplayed his request.

పక్కింటి మీద కాంగ్రెస్ నేత నజర్.. పాడుపని చేసి..

Posted: 09/11/2017 05:34 PM IST
Congress leader ramachandra reddy arrested in jadcherla

ఆయన ఓ కాంగ్రెస్ నాయకుడు. అంతేకాదు బాదేపల్లి సింగిల్‌ విండో మాజీ చైర్మన్ గా కూడా సేవలు చేశాడు. దీంతో డబ్బు, దస్కం బాగానే అర్జించాడు. ఇంకేముందు.. శ్రీశైలం హైవేపై మార్గంలోని జడ్చర్లకు రియల్ బూమ్ రావడంతో.. తన కుటిల అలోచనలతో పక్కింటిని కొనాలన్న దురాశ కలిగింది. దీంతో పక్కింటి వారిని ఇల్లు అమ్మాలని డిమాండ్ చేసి.. వారు నిరాకరించడంతో.. చేయకూడని పనులకు కూడా పాల్పడి.. పెద్ద మనిషన్న గౌరవాన్ని కూడా కొల్పోయాడు.

పోలీసుల కథనం ప్రకారం రామచంద్రారెడ్డి ఇంటిపక్కనే హెడ్ కానిస్టేబుల్ వేమారెడ్డి ఇల్లు వుంది. అయితే పదవీ విరమణ పోందిన తరువాత నుంచి ఇల్లు అమ్మాలని పలుమార్లు రామచంద్రారెడ్డి కోరాడు. ఉన్న ఇంటిని అమ్మలేనని చెప్పిన వేమారెడ్డి గత కోన్నేళ్ల క్రితం అనారోగ్యం బారిన పడి మరణించాడు. దీంతో అతని భార్య విజయలక్ష్మీని ఇల్లు అమ్మాలని వేధించసాగాడు. వారు కూడా అందుకు నిరాకరించడంతో.. కక్ష పెంచుకున్న రామచంద్రారెడ్డి.. వారింటి ముందు చేతబడుల తరహాలో నిమ్మకాయలు, ఉల్లిపాయలు, పసుపు, కుంకుమలు వేసి భయాందోళనకు గురిచేశాడు. అయినా వేమారెడ్డి కుటింబికులు ఇల్లు విక్రయానికి నిరాకరించారు.

తాజాగా రామచంద్రారెడ్డి కన్నుపడిన గ్రామపంచాయితీ భూమిని కబ్జా చేసేందుకు యత్నించగా, దానిని కూడా వేమారెడ్డి కుటుంబికులు అడ్డుకున్నారు. దీంతో వారిపై మరింత కక్షగట్టిన ఈ కాంగ్రెస్ నేత.. వారింటి అవరణలో, ద్వారల ముందు, దుకాణాల ఎదుట మల, మూత్రాలు పారబోసాడు. అయితే ప్రతిరోజు జరుగుతున్న ఈ తంతంగంతో విరక్తి చెందిన జయలక్ష్మీ.. హైదరాబాద్‌లో ఉన్న తమ కుమారుడు కేశవర్ధన్ రెడ్డికి విషయం తెలుపగా, జడ్చర్లకు చేరుకున్న అతను నిఘా పెట్టాడు. అర్థరాత్రి రాత్రి 2 గంటల సమయంలో తన ఇంట్లో నుంచి రెండు ప్లాస్టిక్ కవర్లతో వచ్చిన రామచంద్రారెడ్డి ఆ కవర్లలో ఉన్న మల, మూత్రాలను తమ ఇంటి ముందు పారబోస్తుండగా రెడ్ హ్యాండ్ండ్ గా పట్టుకుని చెట్టుకు కట్టేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles