Hurricane Irma Power Full Winds Hitz America

Hurricane irma begins assault on america

Hurricane Irma, Irma Joes, Catastrophic Flooding

Packing 210-kmph winds, Hurricane Irma knocked out electricity to more than 1 million Florida homes and businesses on Sunday and threatened the American state's Gulf Coast with potentially catastrophic flooding.Joes Hurricane Ready for Next.

ఇర్మా దెబ్బ.. మొత్తం కకావికలం

Posted: 09/11/2017 06:42 AM IST
Hurricane irma begins assault on america

హరికేన్ ఇర్మా విలయ తాండవంతో అమెరికాతోసహా చాలా మట్టుకు దేశాలు అతలాకుతలం అయిపోతున్నాయి. హరికేన్‌ ఇర్మా పెను విధ్వంసం సృష్టించింది. ఈ తుపాన్‌ ధాటికి వేల కొలది ఇళ్లు దెబ్బతినగా, తీరం వెంట చాలా ప్రాంతాలు నీట మునిగాయి. విరిగిపడిన చెట్లు, విద్యుత్‌ స్తంభాల వల్ల ఇళ్ల పైకప్పులు ధ్వంసమైన దృశ్యాలు భీతిగొల్పుతున్నాయి. సుమారు 39 భవనాలు నేలమట్టయినట్లు తెలిసింది.

ఇప్పటి వరకు ఎవరూ మృతిచెందినట్లు సమాచారం లేదు. విద్యుత్, కమ్యునికేషన్‌ సేవల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. వరద ముప్పు ఇంకా తొలగకపోవడంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. మరో 36 గంటల పాటు వరద ముప్పు ఉంటుందని తెలిపారు.

మరోవైపు, క్యూబాలో సముద్రం ముందుకు దూసుకొచ్చిన సీన్లు చాలా చోట్ల దర్శనమిస్తున్నాయి. సైనికులు ఇర్మా ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో నిమగ్నమయ్యారు. బాధితుల కోసం ప్రభుత్వ భవనాలు, పాఠశాలల్లో తాత్కాలిక వసతి కేంద్రాలు ఏటుచేశారు. ఇటీవలే ప్రభుత్వం రిసార్టులు నిర్మించిన ఉత్తర–కేంద్ర తీర ప్రాంతాల నుంచి సుమారు 5 వేల మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తూర్పు క్యూబాలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నామని రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

మరొకటి రెడీ...

పుండు మీద కారం లాగా మరో తుఫాన్ 'జోస్' భీకరంగా మారి తీరంవైపు దూసుకొస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కరేబియన్ దీవి బార్బుడాను వణికించి, నామరూపాల్లేకుండా చేసిన ఇర్మా వెళ్లిపోయిన నాలుగు రోజుల వ్యవధిలోనే 'జోస్' బయలుదేరింది. కేటగిరీ 4 హెచ్చరికలతో వస్తున్న జోస్, బార్బుడాపై మాత్రం కాస్తంత కరుణ చూపుతూ, మిగతా దీవులపై భారీ వర్షాలతో కరేబియన్ దీవులపై విరుచుకుపడింది. జోస్ మరో మూడు నాలుగు రోజుల తరువాత అమెరికా తీరాన్ని తాకవచ్చని అంచనా. దీంతో అమెరికా గజగజలాడిపోతుంది.

ఎన్నారైల పరిస్థితి...

ఇర్మా హరికేన్‌ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, ఇప్పటికే తాము సురక్షిత ప్రాంతాలకు వెళ్లామని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉంటున్న తెలుగువారు తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని స్థానిక యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసిందని, ఇళ్లలో కూడా 10 అడుగుల ఎత్తులోనే ఉండాలని అధికారులు సూచించారని వాళ్లు చెబుతున్నారు. అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని, ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్నారని చెప్పారు. 'ఇర్మా' విరుచుకుపడుతుండటంతో నష్టం చాలా తీవ్రంగా ఉందని, కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వారు అభిప్రాయపడ్డారు. హరికేన్ ప్రభావంతో ప్రచండ గాలులు వీస్తున్నాయని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hurricane Irma  America  Floorida  

Other Articles