Mexico earthquake death toll sharply rises to 61 ప్రకృతి విలయతాండవం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

Mexico earthquake death toll sharply rises to 61 after strongest tremors in century

mexico earthquake, death toll raises, earth quake, Mexico, Americas, natural disaster, climatic conditions, earthquake in mexico, chiapas, southern mexico, pacific, oaxaca, enrique peña nieto, mexicans, tsunami warnings, rumblings

At least 58 people died when the most powerful earthquake to hit Mexico in over eight decades tore through buildings, forced mass evacuations and triggered alerts as far away as Southeast Asia, with most fatalities in the picturesque state of Oaxaca.

ప్రకృతి విలయతాండవం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

Posted: 09/09/2017 11:47 AM IST
Mexico earthquake death toll sharply rises to 61 after strongest tremors in century

అగ్రరాజ్యం అమెరికాపై ప్రకృతి కూడా పగబట్టినట్లు వుంది. ఓ వైపు ఇర్మా సహా మరో రెండు హరికేన్లు తమ ప్రకోపాన్ని చాటుతుండగానే ఇటు మెక్సికో నగరంపై కూడా విలయతాండవం చేయడంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుకుపోతుంది. అత్యంత శక్తిమంతమైన భూకంపం మెక్సికో తీర ప్రాంతాలను అతలాకుతలం చేయడంతో ఇప్పటి వరకు 61 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా గాయపడ్డారు. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి.

మూడు దశాబ్దల క్రితం ఇంతకంటే తీవ్ర ఉధృతితో కంపించిన భూమి ఏకంగా 5 వేల మందిని బలితీసుకున్న గుర్తులను మెక్సికో వాసుల కళ్లముందు మెదిలాయి. భూకంపం ధాటికి తీవ్రంగా నష్టపోయిన టబాస్కో, ఒయాక్సాకా, చియపస్‌ రాష్ట్రాల్లో భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండగా.. వారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

అమెరికాకు, సెంట్రల్ అమెరికాకు మధ్యనున్న మెక్సికో దేశంలో భూకంపం ధాటికి అనేక మంది మరణించిన నేపథ్యంలో ఈ రోజు సంతాప దినంగా ప్రకటించారు అధ్యక్షుడు ఎన్రిక్‌ పెనా నియెటో. మృతులకు నివాళిగా దేశ జెండాలను అవతనం చేశారు. ఒక్క ఒయక్సాకాలోనే 45 మంది మృతిచెందగా.. చియపస్‌లో 12 మంది, టబాస్కోలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ ప్రకంపనలు పొరుగునే ఉండే గ్వాటెమాలా వరకు వ్యాపించాయి. గ్వాటెమాలాలో కూడా ఒకరు చనిపోయినట్లు సమాచారం.

మెక్సికో దక్షిణ తీరంలో చియపస్‌ రాష్ట్రంలోని పిజిజియపన్‌ పట్టణానికి 87 కిలోమీటర్ల దూరంలో, పసిఫిక్‌ మహాసముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా రెక్టారు స్కేలుపై దీని తీవ్రత 8.2గా నమోదైంది. అయితే ఈ ప్రాంతవాసులకు ప్రకంపనలు కొత్త కాదు. ఏడాదిలో పలు పర్యాయాలు ఇక్కడ భూమి కంపిస్తుంది. దీంతో అధికారులు ఈ ప్రాంతవాసులను నిత్యం అలెర్టుగా వుంచేందుకు భూకంప డ్రిల్ ను కూడా నిర్వహిస్తారు. భూకంపం వస్తుందన్న తరుణంలో వారికి అలారమ్ కు మోగుతాయి. ఇంత జాగ్రత్తగా వున్న పదుల సంఖ్యలో ప్రాణాలు మాత్రం పోయాయి. భూకంపం ధాటికి 3.3 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. లక్షల సంఖ్యలో జనంపై ఈ భూకంపం ప్రభావం చూపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : death toll raises  earth quake  Mexico  Americas  natural disaster  climatic conditions  

Other Articles