TADA court sentences Abu Salem to life ముంబై పేలుళ్ల కేసు: ఇద్దరికి మరణశిక్ష.. అబుసలేంకు జీవితఖైదు

Tada court sentences abu salem karimullah khan to life in jail

1993 ‪Mumbai‬ blast, 1993 blasts judgement, Abu Salem, Karimullah Khan, Riaz Siddiqui, Tahir Merchant, Firoz Khan, TADA, 1993 Bombay bombings‬, mumbai blasts, mumbai blasts case, mumbai blasts verdict live, mumbai blasts verdict, abu salem, abu salem live, mumbai news, blasts in india, 1993 mumbai blasts, tada court, sanjay dutt

A TADA court sentenced Abu Salem and Karimullah Khan to life in the 1993 blasts case while fellow convicted Tahir Merchant was sentenced to death and Riyaz Siddiqui was given 10 years jail.

ముంబై పేలుళ్ల కేసు: ఇద్దరికి మరణశిక్ష.. అబుసలేంకు జీవితఖైదు

Posted: 09/07/2017 01:09 PM IST
Tada court sentences abu salem karimullah khan to life in jail

1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన అరుగురికి టాడా కోర్టు ఇవాళ శిక్షలను ఖారారు చేసింది. ఈ కేసులో కీలక నిందితులుగా తేలి.. 257 మంది ప్రాణాలను బలిగొన్న వారిగా తేలిన దోషికి మరణ శిక్షను ఖారారు చేసిన న్యాయస్థానం.. ఈ మరణాలకు పరోక్షంగా కారకులైన మరో ఇద్దరు దోషులకు జీవిత ఖైదు శిక్షను విధించింది. మరో దోషికి పదేళ కఠిన కారాగార శిక్షను విధించింది.

ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను దోషులుగా నిర్థారించిన న్యాయస్థానం ఇవాళ వారికి శిక్షలను ఖరారు చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం టాడా ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ఈ కేసులో దేశప్రజల ప్రాణాలను బలిగోన్న తాహీర్ మర్చెంట్ అలియాస్ తాహీర్ తాఖియ్యాకు మరణశిక్షను విధించింది. అతనితో పాటు ఈ వరుస పేలుళ్లకు కీలక వ్యక్తిగా భావించిన ఫిరోజ్ ఖాన్ కు కూడా మరణశిక్షను విధించింది. అయితే కేసు విచారణలో చనిపోయిన మరో దోషి ముస్తఫా దోస్సాకు కూడా న్యాయస్థానం మరణ శిక్షను విధించింది.

కాగా, భారత్ మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడైన అబు సలేంకు టాడా కోర్టు జీవిత ఖైదు శిక్షను ఖారారు చేసింది. అతనితో పాటు ఈ కేసులో దోషిగా తేలిన కరీముల్లాకు కూడా న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది. వీరితో పాటు ఈ కేసులో న్యాయస్థానం దోషిగా నిర్ధారించిన రియాజ్ సిద్దిఖీకి టాడా కోర్టు పదేళ్ల శిక్షను విధించింది. ఈ కేసులో కీలక నిందితుడైన అబుసలేం.. పోర్చుగల్ విమానాశ్రయంలో మారువేశంలో సంచరిస్తుండగా అనుమానం వచ్చిన ఇంటర్ పోల్ అధికారులు.. ముంబై పోలీసులు సంయుక్తంగా అతన్ని పట్టుకుని.. భారత్ కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

1993లో మార్చి 12న జరిగిన ముంబై వరస బాంబు పేలుళ్లలో 257 మంది అసువులు బాయగా, 713 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్ల ప్రభావం భారత అర్థిక రాజధాని ముంబైపై తీవ్రంగా పడింది. ఏకంగా 27 కోట్ల రూపాయల అస్థినష్టం కూడా వాటిల్లింది. దీనిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తును ప్రారంభించగా, ఆ తరువాత ఈ కేసును సిబిఐకి బదిలీ చేశారు. 24 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో దోషులకు టాడా ప్రత్యేక న్యాయస్థానం శిక్ష విధించింది. దీంతో బాధిత కుటుంబాలకు న్యాయం జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles