Trump's DACA program End Effects on 7000 Indians

Trump expected to end program for young immigrants

Deferred Action for Childhood Arrivals, DCDA Donald Trump, Indians DCDA, DCDA Controversy

Ameircan President Donald Trump decides to end DACA, could impact 7000 Indian-Americans

ఇండియన్స్ నెత్తిన ట్రంప్ మరో బాంబు

Posted: 09/04/2017 04:35 PM IST
Trump expected to end program for young immigrants

అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకోబోయే మరో నిర్ణయం 7000 మంది ఇండో-అమెరికన్ల మీద పెను ప్రభావంను చూపే అవకాశం కనిపిస్తోంది. చిన్నారులుగా అమెరికాలో అడుగుపెట్టి, అక్కడే ఉంటూ పనిచేసుకుంటున్న లక్షలాది విదేశీయులను తిరిగి స్వదేశాలకు పంపేందుకు సిద్ధమైపోతున్నారు.

తమ తల్లిదండ్రులతో కలసి వచ్చి, పెద్దయ్యాక ఇప్పుడు అక్కడే సెటిలై పోయినవారిని అక్రమ వలసదారులుగా గుర్తించనున్నారు. అమెరికాలో ఉన్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా అప్పటి ఒబామా ప్రభుత్వం 2012 జూన్ లో  'బాల్యంలో వచ్చిన వారిపై చర్యలు వాయిదా (డీఏసీఏ)' పేరుతో ఓ కార్యక్రమం చేపట్టింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ట్రంప్ రద్దుచేయబోతున్నారు. నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే ఈ ప్రోగ్రాంపై ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

ఇక ఒబామా ఇచ్చిన ఉత్తర్వులను ఈ నెల ఐదో తేదీలోగా రద్దు చేయాలని, లేకపోతే న్యాయస్థానాలకు వెళతామంటూ ట్రంప్ కు అనుకూలంగా ఓటేసిన రాష్ట్రాలు డెడ్ లైన్ విధించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ కూడా నిషేధాన్ని ఎత్తివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. అయితే అందుకోసం చట్టం చేయటానికి ఆరు నెలల సమయం విధించే అవకాశం ఉందని వైట్ హౌజ్ వర్గాలు చెబుతున్నాయి. డీఏసీఏని ట్రంప్ రద్దు చేస్తే దాని ప్రభావం 8 లక్షల మంది విదేశీయులపై, అందులోనూ 7వేల మందికి పైగా భారతీయులపై ప్రభావం చూపనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles