Gautham Reddy Suspended by YS Jagan from YSRCP

Gautham reddy shocking comments on vangaveeti

YSR Congress Party, Gautam Reddy, Controversial Interview, Social Media, Vijayawada Tensions, YS Jaganmohanreddy, Gautam Reddy Suspended, YSRCP Gautam Reddy, Vangaveeti Murder Comments, Gautam Reddy Shocking Comments, Gautam Reddy Interview, Gautam Reddy Controversial Interview

Vijayawada YSRCP Leader Gautham Reddy's shocking comments on Vangaveeti Ranga in Social Media. YS Jagan suspends Gautham Reddy for Vangaveeti Ranga comments. Differences with Vangaveeti Radha Gautam Reddy Makes this Statement.

బెజవాడ వైసీపీలో అసలేం ఏం జరిగింది?

Posted: 09/04/2017 06:55 AM IST
Gautham reddy shocking comments on vangaveeti

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో వర్గపోరు విజయవాడలో ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. వైసీపీ నేత గౌతం రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపటంతో.. వైసీపీ నుంచి ఆయనను సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

వంగవీటి రంగా హత్యను ఆయన సమర్థిస్తూ ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. వంగవీటి రంగా, రాధలను చంపడం దారుణమని ఎందుకంటారని, రౌడీ రాజకీయాలే పరమావధిగా ముందుకెళ్లే వారు పోస్టుమార్టానికి వెళ్లాల్సిందేనని గౌతంరెడ్డి అన్నారు. ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ఓ కథ కూడా చెప్పారు.

ఓసారి ఓ పాము కనిపించిన వారినందరినీ కాటువేసుకుంటూ వెళ్తూ చివరికి ఓ దేవుడి ఫొటో వెనక దాక్కుందని, కానీ తమను కాటువేసిన పాము దేవుడి ఫొటో వెనక దాక్కుంది కాదా.. అని జనాలు చంపడం మానేస్తారా? అని ప్రశ్నించారు. నిరాహార దీక్షలో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా రౌడీ రాజకీయాలు చేసే వారి భవిష్యత్ పోస్టుమార్టమేనంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. రౌడీ రాజకీయాలు వదిలి తమలాగా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. వాళ్లు వచ్చిన తర్వాతే కుల రాజకీయాలు బయటకు వచ్చాయని ఆరోపించారు. వారు ఈ కులం వారిని చంపితే, వారు ఈ కులం వారిని చంపడం మొదలుపెట్టారని గౌతం రెడ్డి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

వైరల్.. తీవ్ర ఉద్రిక్తత...

వంగవీటి రాధతో గౌతంరెడ్డికి అస్సలు పడదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాధ మరణంపై గౌతం చేసిన వ్యాఖ్యలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయవాడ భగ్గుమనడానికి కారణమయ్యాయి. చివరికి రాధా, ఆయన తల్లి రత్నకుమారి అరెస్ట్‌కు దారి తీశాయి. ఆపై ఆయనకు ఆ పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు అందాయి. ఈ సందర్భంగా వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ, పూనూరు గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీ నేతలు ఏ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ షోకాజ్ నోటీస్ జారీ చేసినట్టు చెప్పారు.

వైఎస్ జగన్ సీరియస్...

వైఎస్ రాజశేఖరరెడ్డికి వంగవీటి రంగా మంచి స్నేహితుడని, వంగవీటి రంగాను తాము ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటామని అన్నారు. అనంతరం పార్టీ అధినేత వైఎస్ జగన్ గౌతంను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వంగవీటి రాధ, రంగాలపై గౌతంరెడ్డి వ్యాఖ్యలు సరికాదని, అనవసర వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని జగన్ పేర్కొన్నారు. కాగా, కడప జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ వచ్చిన వైఎస్‌ జగన్‌ ఈ రోజు రాత్రి పార్టీ నాయకులతో ఈ అంశంపై చర్చించారు. గౌతంరెడ్డి వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని వైఎస్సార్ సీపీ క్రమశిక్షణా కమిటీని జగన్ ఆదేశించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijayawada  Vangaveeti Raga Murder  Gautam Reddy  Controversial Interview  

Other Articles