26 yr old held for honey trap.. hunt on for two others మాయలాడి వలకు చిక్కితే నిలుపుదోపిడే..

26 yr old held for honey trap hunt on for two others

honey trap, social media, facebook, smart phone, nanjangud police, mysore, karnataka, crime

Close on the heels of Nanjangud Police busting an eight-member honey-trapping gang including a woman last week,

మాయలాడి వలకు చిక్కితే నిలుపుదోపిడే..

Posted: 08/30/2017 07:23 AM IST
26 yr old held for honey trap hunt on for two others

తియ్యని గొంతు, సోషల్ మీడియాలో అందమైన పోస్టులు.. ఈ రెండే అమె పెట్టుబడి. మరీ అర్జన అంటారా..? ఏముంది అమె వలలో పడిన వాడికి తిరుపతి వెళ్లకుండానే క్షవరం జరిపోదూ. వినడానికి విడ్డూరంగానే వున్నా ఇది పక్కా నిజం. ఈమైపై పిర్యాదులు అధికంగా రావడంతో వాటిని పరిశీలించిన పోలీసులు నిఘాపెట్టి అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం ఈ మాయలాడి అనుచరులు పోలీసులకు చిక్కినా ఈమె మాత్రం తప్పించుకుంది.

కాగా క్రితం రోజున ఈమెను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కాగా ఈ కేసులో ఈమెను కూడా వినియోగించుకున్న కీలక నిందితుడు మాత్రం ఇంకా పరారీలోనే వున్నాడు. అసలు ఈ మాయలాడి ఏం చేస్తుందంటారా..? అందమైన ఫోటోలు.. రాగాలు పలికే గోంతుతె యువకులను దోచేస్తున్న ఓ మాయలేడి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. మైసూరులోని అశోకపురానికి చెందిన యువతి మాలా ఫోన్లు, సోషల్ మీడియాను చక్కగా ఉపయోగించుకుంటూ యువకులతో పరిచయం పెంచుకుంటుంది.

ఆమె మాటలకు ఆకర్షితులైన వారితో రోజు ఫోన్లో మాట్లాడుతుంది. చాట్ చేసి మత్తెక్కిస్తుంది. వారు పూర్తిగా తన వలలో చిక్కినట్టు భావించిన తర్వాత ప్లాన్ అమలు చేస్తుంది. వన్ ఫైన్ డే.. ఫలానా దగ్గర కలుసుకుందామని తన వలలో పడిన యువకుడికి ఆఫర్ ఇస్తుంది. నమ్మి వచ్చిన అతడిని తన ముఠాతో కాపుకాసే యువతి నిలువు దోపిడీ చేస్తుంది. మారణాయుధాలతో బెదిరించి అతడి దగ్గర ఉన్న డబ్బు, దస్కంతో దోచుకుంటుంది. ఆమె వలలో పడి మోసపోయిన యువకుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఫిర్యాదులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : honey trap  social media  facebook  smart phone  nanjangud police  mysore  karnataka  crime  

Other Articles