maharashtra hammer baba backbone treatment goes viral నేను గానీ లాగి ఒక్కటి పీకితే.. నడుంనోప్పి మాయం: సుత్తిబాబా లీల

Maharashtra hammer baba backbone treatment goes viral

hammer baba, back pain, pain relief treatment, maharashtra village, chronic back pain, maharashtra, viral news, viral video

A maharashtra hammer baba backbone treatment goes viral, who is a traditional healer has shot into fame in India with a rather drastic cure for chronic back pain

ITEMVIDEOS: నేను గానీ లాగి పీకితే.. నడుంనోప్పి మాయం: సుత్తిబాబా లీల

Posted: 08/26/2017 06:51 PM IST
Maharashtra hammer baba backbone treatment goes viral

మహారాష్ట్రలో కొత్తగా వెలసిన ఓ బాబా తన విచిత్ర వైద్యంతో బాధలను నయం చేస్తున్నారు. ఆ వైద్యాపికి సంబంధించిన వీడియో కాస్తా నెట్టింట్లో పోస్టుకావంతో అది వైరల్ గా మారింది.  ఇంతకీ ఈ బాబా గారు చేసే విచిత్ర వైద్యంలో ఏంటో..? దేనికో తెలుసా... దీర్ఘకాలిక నడుం నొప్పితో బాధపడుతున్న వారికి ఈ బాబా వైద్యం చేస్తారు. అంటే లాగి పెట్టి ఒక్కటి పీకి వైద్యం అద్యందంటూ డబ్బు వసూలు చేస్తారా..? అంటే రమారమి అలాగే చేస్తారు. కాకపోతే చెయ్యితో కాకుండా సుత్తితో.. అయితే ఒక్కటి కాకుండా వరుసపెట్టి కనీసం పదిపదిహేను పీకుతారు.

ఔనా.. మరి నడుం వుంటుందా..? ఊడుతుందా..? అనేగా మీ సందేహం. నడుం నోప్పితో వచ్చే బాధితులకు ఇట్టే పరిష్కార మార్గం చూపిస్తానంటూ తనదైన శైలిలో వైద్యం చేస్తున్న ఈ బాబా వద్ద వైద్యం చేయించుకునేందుకు దూరప్రాంతాలకు చెందిన వచ్చిన జనం బారులు తీరుతున్నారు. అేదంటి అంటే ఖరీదైన కార్పోరేట్ వైద్యం చేయించుకునే స్థోమత లేక.. జన ప్రచారంతో సుత్తి వైద్యం వెలుగులోకి రావడంతో ఈయనగారి వద్దకు బాధితులు క్యూకట్టి మరీ వైద్యం చేయించుకుంటున్నారు.

ఇంతకీ ఆయన ఏ మందో మాకో ఇచ్చి నడుం నొప్పిని దూరం చేస్తున్నారనుకుంటే పప్పులో కాలేసినట్లే.. సుత్తితో గట్టిగా వెన్నుపూసపై కొడుతూ నొప్పిని తగ్గిస్తారట.. అంతేకాదు ఈ వైద్యుడి గురించిన పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదు. ఆయనది ఏ గ్రామం. ఎక్కడ వైద్యం చేస్తున్నారు.. ఎన్నేళ్లుగా ఈ వైద్యం చేస్తున్నారు.. అసలు ఆయన పేరేంటి అన్న విషయాలు కూడా తెలియరాలేదు. కాగా ఇలాంటి నాటు వైద్యం మాత్రం అతంత ప్రమాదకరమని అర్థోపిడీషియన్లు చెబుతున్నారు. సుత్తితో కొడుతూ చేస్తున్న ఈ నాటు వైద్యం భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇలాంటి నాటు వైద్యం చేసే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా పెరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hammer baba  back pain  treatment  maharashtra  viral news  viral video  

Other Articles