Imported Chinese shoes received in tricolor boxes క్షమించరాని తప్పు చేసిన చైనా..

Imported chinese shoes received in tricolor boxes indians enraged

doklam,china,ladakh,xinhua,bhutan,tricolour shoe box,almora,uttarakhand,shoe boxes,chinese shoes,national flag,tricolour,uttarakhand shoe boxes indian flag chinese

Amid rising Sino-Indian tensions due to the Doklam stand-off, the Chinese have constantly tried to humiliate India with racial slurs, accusations, and anti-India videos.

క్షమించరాని తప్పు చేసిన చైనా..

Posted: 08/26/2017 10:39 AM IST
Imported chinese shoes received in tricolor boxes indians enraged

భారత్‌, చైనాల సంబంధాలపై డోక్లాం వివాదం నేపథ్యంలో చైనా ఎంతటి కవ్వింపులకు పాల్పడుతున్నా.. చివరకు సైనిక బలప్రదర్శలకు పాల్పడినా.. మరో వైపు రాళ్లదాడికి దిగినా.. సంయమనం పాటిస్తూ.. వారి చర్యలను తిప్పికొట్టిన భారత్ ను రెచ్చగొట్టడంలో పూర్తిగా విఫలమైన చైనా ఇక మరో విధంగా రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంది. ఈ సారి చైనా క్షమించరాని తప్పుకు పాల్పడింది. సగటు భారతీయుడు గౌరవంగా చూసుకునే మన దేశ జాతీయ జెండాను పరాభించే చర్యకు పూనుకుంది. బూట్ల డబ్బాలపై జాతీయ జెండాను ముద్రించింది. ఈ దురదృష్టకర ఘటన ఉత్తరాఖండ్ అల్మోరాలో చోటు చేసుకుంది.

చైనా నుంచి దిగుమతి చేసుకున్న బూట్ల డబ్బాలపై మన జాతీయ పతాకంలో ఉండే త్రివర్ణాలతో బొమ్మలు ఉన్నాయని స్థానిక దుకాణదారుడు పోలీసులను ఫిర్యాదు చేయడంతో చైనా కుట్రలు వెలుగుచూశాయి. బూట్లను పంపిన పెట్టెల పైభాగంలో మూడు రంగుల జెండాను ముద్రించడంతో పాటు.. అదే డబ్బా అడుగున మాండరిన్ భాషలో పదాలు రాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డోక్లాం వివాదం నేపథ్యంలో భారతీయుల మనోభావాలను దెబ్బతీసేందుకు చైనా ఇలా కుటిలయత్నాలను చేస్తుందని పోలీసులు భావిస్తున్నారు.

దుకాణదారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అల్మోరా ఎస్‌ఎస్పీ రేణుకా దేవి తెలిపారు. బూట్లను దుకాణదారుడికి సరఫరా చేసిన రుద్రపూర్‌లోని తమ్మన ట్రేడర్స్‌ యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు ఉద్దమ్ సింగ్ నగర్‌ ఎస్ఎస్పీ సదానంద్ దతే చెప్పారు. న్యూఢిల్లీలోని సరఫరాదారు నుంచి తెప్పించామని, ఎక్కడ ఉంటారనే విషయం తమకు తెలియదని ట్రేడర్స్ యాజమాన్యం చెప్పినట్లు ఎస్ఎస్పీ వివరించారు. త్వరలోనే న్యూఢిల్లీ సరఫరాదారును గుర్తించి ప్రశ్నిస్తామని వెల్లడించారు. కాగా గత మార్చిలో కూడా చైనాకు చెందిన అప్పో ఫోన్ కార్మికులు భారత జాతీయ జెండాను అవమానించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : doklam  china  tricolour shoe box  almora  uttarakhand  shoe boxes  chinese shoes  national flag  

Other Articles