Privacy a fundamental right, declares Supreme Court వ్యక్తిగత గోప్యత పౌరుల ప్రాథమిక హక్కే..!

Sc rules right to privacy is a fundamental right validity of aadhaar law in dilemma

Right to Privacy, Fundamental Right, Aadhaar, Supreme Court, right to privacy, SC ruling on right to privacy, right to privacy verdict, fundamental right, Constitution of India, AADHAR

A nine-judge bench led by Chief Justice of India JS Khehar ruled right to privacy is guaranteed fundamental right in a ruling that will have a bearing on civil rights as well as Aadhaar.

కేంద్రానికి చుక్కెదురు.. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనన్న ‘‘సుప్రీం’’

Posted: 08/24/2017 11:32 AM IST
Sc rules right to privacy is a fundamental right validity of aadhaar law in dilemma

వ్యక్తిగత గోప్యత అనేది వ్యక్తుల ప్రాథమిక హక్కేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించింది.  ప్రభుత్వం నుంచి పోందే పథకాలన్నింటికీ అధార్ కార్డును అనుసంధానం చేస్తున్నామని, అనుసంధానం చేసుకున్నవారికే పథకాలు వర్తిస్తాయని చెప్పుకోచ్చిన కేంద్రం ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో 2015లో అధార్ అనుసంఘానంపై వ్యక్తిగత గోప్యతను బహిర్గత పర్చలేమంటూ దాఖలైన పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ కీలక తీర్పు వెల్లడించింది.

అధార్ కార్డులుంటేనే ఏ ప్రభుత్వ పథకమైనా అర్హతలను బట్టి వర్తిస్తుందని గత మూడేళ్లుగా చెప్పుకోచ్చిన కేంద్రం ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు మింగుడుపడకుండా చేసింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో తొమ్మిది మంది సభ్యులు గల ధర్మాసనం.. వ్యక్తిగత గోప్యత పౌరుల ప్రాథమిక హక్కు అని కీలక తీర్పును వెలువరించడంతో.. అధార్ కార్డుతో ప్యాన్ కార్టు అనుసంధానంపై సందిగ్దథ ఏర్పడింది.  అత్యున్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ఇక అధార్ కార్డుల అవసరం లకుండానే అర్హులకు ప్రభుత్వ పథకాలు అందనున్నాయి.

ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు తదితర వాటికి ఆధార్ కార్డును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన నేపథ్యంలో వాటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆధార్ పై విచారించేందుకు ఏర్పాటుచేసిన తోమ్మిది మంది సభ్యులు గల న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. ఈ విషయంలో ముందుగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కా, కాదా అన్న అంశంపై చర్చ జరిపి.. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. మూడు వారాల్లో ఆరు రోజుల పాటు వాదనలు విన్న ధర్మాసనం ఇవాళ కీలక తీర్పును వెలువరించింది.

కాగా, ప్రభుత్వ పథకాలకు అధార్ కార్డును అనుసంధానం చేయాడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై ఐదుగురు సభ్యులు గత ధర్మాసనం త్వరలో విచారణ చేసట్టనుంది. ప్రభుత్వ పథకాలతో పాటు రాయితీ గ్యాస్ సిలిండర్లకు, ఆహార భద్రత పథకం కింద సరుకులు తీసుకునేందుకు, ఇక ప్యాన్ కార్డుకు, ఇలా అనేక పథకాలకు అధార్ కార్డును కేంద్ర ప్రభుత్వం అనుసంధానించడాన్ని సవాల్ చేస్తూ.. ధాఖలైన పిటీషన్లపై ఐదుగురు సభ్యులు గల ధర్మాసనం విచారించనుంది. ఈ తీర్పుపైనే యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Right to Privacy  Fundamental Right  Aadhaar  Supreme Court  Constitution of India  AADHAR  

Other Articles