high alert ahead of verdict in Ram Rahim Singh case అధ్యాత్మిక గురువు లైంగికదాడి కేసులో తీర్పు.. హైఅలర్ట్..

Haryana punjab on high alert ahead of verdict in dera chief ram rahim singh case

Dera Sacha Sauda, Gurmeet Ram Rahim Singh, sexual assault, Punjab, Haryana, Sexual Exploitation case, High Alert, Court Verdict crime

Haryana and Punjab were put on high alert and prohibitory orders imposed ahead of the court verdict in a sexual exploitation case against Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh

ఆధ్యాత్మిక గురువు లైంగికదాడి కేసులో తీర్పు.. హైఅలర్ట్..

Posted: 08/24/2017 09:34 AM IST
Haryana punjab on high alert ahead of verdict in dera chief ram rahim singh case

వివాదాస్పద అధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీం సింగ్ బాబాపై లైంగికదాడి కేసులో శుక్రవారం సీబిఐ న్యాయస్థానం తీర్పును వెలువరించనుంది. డేరా సచ్చా సౌదా చీఫ్ గా రాక్ స్టార్ గా వెలుగొందుతున్న ఈ బాబా.. 2002లో తన ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారానికి తెగబడ్డారని బాబాపై కేసు నమోదైన విషయం తెలిసిందే. బాధితురాళ్ల పిర్యాదును అప్పట్లో నమోదు చేసుకున్నా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బాధితురాళ్లు ఏకంగా మహిళా కమీషన్ ను కూడా అశ్రయించి తమకు జరిగిన అన్యాయాన్ని వెల్లబోసుకున్నారు.

దీంతో 2005లో పోలీసులు నమోదు చేసిన కేసును సిబిసీఐడీకి బదిలీ చేశారు. కాగా ఆ తరువాత ఈ కేసు సీబిఐ చేతికి అప్పగించింది అప్పటి ప్రభుత్వం. దీంతో ఈ కేసు విచారణకు హాజరుకాకపోవడం.. వాయిదాలను పట్టించుకోకపోవడంతో మండిపడిన న్యాయస్థానం అతన్ని కోర్టులో హాజరపర్చాల్సిందిగా అదేశాలను జారీ చేసింది. న్యాయస్థానం అదేశాల నేపథ్యంలో బాబాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చేందుకు వెళ్లిన పోలీసులకు బాబా భక్తులు చుక్కలు చూపించారు. దాదాపుగా రెండు వేల మంది భక్తులు భాబా అశ్రమానికి కాపాలాగా వ్యవహరించారు.

అద్యాత్మిక గురువు కోసం అశ్రమంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులపై ఆయన భక్తులు దాడులకు తెగబడ్డారు. అత్యంత నాటకీయ పరిస్థితుల నేపథ్యంలో డేరా సచ్చా సౌదా అశ్రమంలోనికి ప్రవేశించిన పోలీసులు.. తనిఖీలు చేపట్టగా వందల సంఖ్యలో మారణాయుధాలు లభ్యమయ్యాయి. అంతేకాకుండా అరు మృతదేహాలు కూడా కనుగోన్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ రామ్ రహీం సింగ్ బాబాను కోర్టులో హాజరపర్చారు పోలీసులు.

కాగా ఈ కేసుకు సంబంధించిన కేసులో శుక్రవారం సీబిఐ న్యాయస్థానం తీర్పును వెలువరించనున్న తరుణంలో రెండు రోజుల ముందుగానే ఆయన మద్దతుదారులు వేల సంఖ్యలో న్యాయస్థానం అవరణకు చేరుకోంటున్నారు. ఇప్పటికే దాదాపుగా 10 వేల మందికి పైగా భక్తులు పంచకుల సిబీఐ న్యాయస్థానం పరిసర ప్రాంతాలకు చేరుకున్నారని తెలుస్తుంది. దీంతో పంజాబ్ సహా హరియాణా రాష్ట్రాలలో 144 సెక్షన్ ను అమలు పర్చిన పోలీసులు పంచకుల కోర్టు వద్ద హై అలర్ట్ ప్రకటించారు.

దాదాపుగా 35 వేల మంది అధ్యాత్మిక గురువు భక్తులు ఆయన పంచకుల ప్రార్థానస్థలం నామ్ చర్చా ఘర్ కు చేరకున్నారని సమాచారం అందుకున్న పోలీసులు భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. తీర్పు నేపథ్యంలో గుర్మిత్ బాబా భక్తులు ఉద్దేశపూర్వకంగా దాడులు, అందోళనలకు పాల్పడే అవకాశాలు అధికంగా వున్నాయన్న సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. గురు, శుక్రవారాలు పంచకులతో పాటు ఆయా పరిసర ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.  పంజాబ్‌కి ఇప్పటికే 75 కంపెనీల కేంద్ర బలగాలు చేరుకున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్‌ల సహాయంతో నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sexual assault  CBI court  Punjab  Haryana  High alert  Gurmeet Ram Rahim Singh  crime  

Other Articles