khushboo slams bjp on owning triple talaq victory కైఫ్ ను ఏకీపారేశారు.. ఇది బీజేపి ఘనత కాదు

Cricketer mohammad kaif trolled again by twitterities

Mohammad Kaif, News, Supreme Court ,triple talaq, trolls, Twitter, Social Media, Twitterities, cricketer, Narendra Modi, muslim women, shena bora, khushboo sundar, bjp owns triple talaq victory, khushboo

Indian cricketer Mohammad Kaif, once again faced the ire of twitterities, this time for supporting the Supreme Court’s decision of putting aside instant triple talaq practice among the Muslims.

కైఫ్ ను ఏకీపారేశారు.. ఇది బీజేపి ఘనత కాదు

Posted: 08/23/2017 11:09 AM IST
Cricketer mohammad kaif trolled again by twitterities

భారత క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్ ను ముస్లిం నెటిజ‌న్లు మళ్లీ ఏకిపారేశారు. అయతే ఈసారి ఆయన ముస్లిం మతాచారాలకు విరుద్దంగా ఏమీ చేయకుండానే అయనపై విమర్శలు గుప్పించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు క్రితం రోజున ట్రిపుల్ త‌లాఖ్ అంశంపై వెలువరించిన సంచలన తీర్పును యావత్ దేశ ప్రజల మాదిరిగానే ఆయన స్వాగతించారు. హైదరాబాద్ కు చెందిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తరహాలోనే ఆయన కూడా స్వాగతిస్తూ.. ఇకపై ముస్లింలలో కూడా మహ్మదీయ మహిళలకు సముచిత స్థానం లభిస్తుందని అశాభావాన్ని వ్యక్తం చేస్తూ.. దీంతో లింగ సమానాత్వం సాధ్యమవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

దీంతో ముస్లిం నెటిజ‌న్లు మ‌రోసారి ఆయ‌నపై విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పించారు. దీనికి స్పంద‌న‌గా ముస్లిం నెట్ జనుల నుంచి తీవ్రస్థాయిలో ఆయన విమర్శలను అందుకున్నారు.  ముస్లిం అయ్యివుండి ఇస్లాంలో మ‌హిళ‌ల‌కు ఉండే ర‌క్ష‌ణ సంగ‌తి నీకు తెలియ‌దా? అంటూ కొందరు కైఫ్ పై నేరుగా మాటల యుద్దానికి దిగారు. ఇక మరికోందరు ఖురాన్ చ‌దివిన త‌ర్వాత లింగ‌స‌మ‌న్యాయం గురించి మాట్లాడండి!`, `మీ మీద త్వ‌ర‌లో ఫ‌త్వా జారీ అవుతుంది చూడండి!`, `ఇలాంటి పోస్టులు చేయ‌కు కైఫ్‌!` ‘ ఎవరి మెప్పు పొందేందుకో మీరు ఇలాంటి పోస్టులు చేస్తూ.. ముస్లింలను అవహేళన చేయకండీ అంటూ వివిధ ర‌కాలుగా ముస్లిం నెటిజ‌న్లు స్పందించారు.

ఇది బీజేపి ఘనత కాదు: ఖుష్బూ

ట్రిపుల్‌ తలాక్‌ పై దేశ అత్యున్నత ధర్మాసనం నిన్న వెలువరించిన విజయాన్ని.. తమ విజయంగా బీజేపి మలుచుకుని దేశ ప్రజల్లోకి ఈ సందేశాన్ని తీసుకువెళ్లే ప్రయత్నాలను మొదలుపెట్టేసిందని  నటి, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఖుష్బూ సుందర్‌ అన్నారు. దేశం సాధించే అన్ని విజయాలను తమ ఖాతాలోకి వేసుకునే ప్రయత్నాలు చేయడం, క్రెడిట్‌ చేజిక్కించుకునే ప్రయత్నాలకు చేయడం బీజేపికి మంచిది కాదని అమె అన్నారు. ఈ ప్రయత్నాలతో ప్రజల చిత్కారానికి గురికాక తప్పదని అమె దుయ్యబట్టారు. ట్రిపుల్‌ తలాక్‌ విజయం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ క్రెడిట్‌ కాదని అన్నారు. ఇది భారతీయ మహిళల విజయమని అమె పేర్కొన్నారు. 'సుప్రీంకోర్టు విడాకులపై నిషేధం విధించలేదు. కానీ, అప్పటికప్పుడు తలాక్‌ చెప్పే పద్దతిపై నిషేధం విధించిందని అమె వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Social Media  Supreme Court  Triple Talaq  Trolls  Twitter  Mohammad Kaif  cricketer  Narendra Modi  shena bora  khushboo  

Other Articles