Nandyal by-polls starts peacefully, stakes high for TDP, YSRCP ప్రశాంతంగా ప్రారంభమైన నంద్యాల ఉప ఎన్నిక

Nandyal by polls starts peacefully stakes high for tdp ysrcp

nandyal by polls shedule, nandyal by polls notification, nandyal by polls date, nandyal by polls counting, nandyal, assembly, by-polls, by-elections, election comission, TDP, YSRCP, bhuma nagi reddy, election news

When 2.19 lakh voters of Nandyal Assembly constituency in Kurnool district of Andhra Pradesh exercise their franchise in the by-election today

ప్రశాంతంగా ప్రారంభమైన నంద్యాల ఉప ఎన్నిక

Posted: 08/23/2017 09:04 AM IST
Nandyal by polls starts peacefully stakes high for tdp ysrcp

టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అకస్మిక మృతితో వచ్చిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన ఉపఎన్నికలో నియోజకవర్గ  పరిధిలోని రెండు లక్షల 18 వేల 858 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠతో సాగుతున్న ఈ ఎన్నికలలో గెలుపు కోసం అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు హోరహారీ ప్రచారాన్ని నిర్వహించాయి. ఓటర్లు ప్రశాంతంగా, స్వేచ్ఛగా తమ ఓటు  హక్కును వినియోగించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సున్నిత, అతిసున్నిత పోలింగ్‌ కేంద్రాల భద్రత బాధ్యతను ప్రత్యేకించి కేంద్ర పారామిలిటరీ బలగాలకు అప్పగించడంతో ఏక్కడ ఎలాంటి అరాచక శక్తులు పేట్రేగిపోకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఎన్నికల పోలింగ్ లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారని అనుమానం వున్న 2వేల మందికి పైగా అనుమానితులను పోలీసులు బైండోవర్ చేశారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ లో పాల్గొనేందుకు ప్రజలు కూడా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరకుంటున్నారు. సాయంత్రం అరు గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది.

టీడీపీ తరపున భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డి, వైసీపీ తరపున మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి అబ్దుల్‌ ఖాదర్‌, రాయలసీమ పరిరక్షణ సమితి అభ్యర్థి భవనాశి పుల్లయ్య సహా 15 మంది బరిలో ఉన్నారు. ఈ నెల 28న ఓట్ల లెక్కింపు ఉంటుంది. నియోజకవర్గ పరిధిలోని మొత్తం 255 పోలింగ్ బూత్ లకు దాదాపు 6వేల మంది  పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. కాగా గోస్పాడు మండలం ఒంటేరులో గల పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం మొరాయించింది. ఉదయాన్నే ఈవీఎం మొరాయించడంతో అప్రమత్తమైన అధికారులు లోపాన్ని గుర్తించి సరిచేశారు. దీంతో పోలీంగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

పోలీంగ్ అధికారికి గుండెపోటు

నంద్యాల ఉపఎన్నికలలో పోలింగ్ అధికారిగా విధులు నిర్వహించేందుకు వచ్చిన అధికారికి గుండెపోటు రావడం.. కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..  నంద్యాల మండలం పూలూరులో పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరెడ్డికి గుండెపోటు వచ్చింది. హుటాహుటిన అతన్ని అక్కడున్న పోలీసులు అత్యవసర చికిత్సకై స్థానిక ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసరెడ్డి స్థానంలో మరో ఆఫీసర్‌‌ను నియమించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ ఎన్నికల నిర్వహణలో మొత్తం 1600 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nandyal  assembly  by-polls  election comission  TDP  YSRCP  bhuma nagi reddy  election news  

Other Articles