చరిత్రాత్మక తీర్పు నేడే.. తలాక్ పై ఏం తేలుస్తారో? | Landmark Verdict On Triple Talaq Today

Supreme court today gives verdict on triple talaq

Controversial Islamic Practice, Triple Talaq, Talaq Supreme Court, Supreme Court Verdict, Talaq Decision, Supreme Court Talaq Final Verdict, Triple Talaq India, Indian Supreme Court Talaq

Controversial Islamic practice that allows men to leave their wives immediately by stating "talaq" (divorce) three times should be banned will be decided by five judges of the Supreme Court today at 10:30 am. Triple talaq has so far been legal for Muslims according to the Constitution, but several Muslim women who have been divorced because of it, including on Skype and on WhatsApp, have appealed to the top court to end the practice.

సుప్రీం చరిత్రాత్మక తీర్పు నేడే...

Posted: 08/22/2017 08:39 AM IST
Supreme court today gives verdict on triple talaq

ముస్లిం చట్టాల్లో వివాదాస్పదంగా మారిన ట్రిపుల్ తలాక్‌(అహసన్ తలాక్, హసన్ తలాక్ మరియు తలాక్ ఉల్ బిద్ధత్) పై నేడు సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెలువరించనుంది. తలాక్ తోపాటు బహుభార్యతత్వం పై ఈ యేడాది మే లో ఆరో రోజులపాటు అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.

ఉదయం 10.30 నిమిషాలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల ట్రిపుల్ తలాక్ అంశం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశగా మారింది. వాట్సాప్, స్కైప్ లాంటి సోషల్ మీడియాలలో కూడా తలాక్ చెల్లుబాటు అవుతుండటంతో వివాదం మరింత ముదిరింది. ముస్లింలలోనే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా కేంద్రం మాత్రం ఇది చట్ట సమ్మతం కాదని, రాజ్యాంగ విరుద్ధమని, ఉమ్మడి చట్టం అమలుకావాలని వాదిస్తోంది.

ఇక సైరాభాను (35) అనే మహిళ ట్రిపుల్ తలాక్‌ను సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చి తీవ్ర చర్చకు కారణమైంది. సైరాభానుకు అఫ్రీన్ రెహమాన్, గుల్షన్ ప్రవీణ్, ఇష్రాత్ జహాన్ అతియా సబ్రీలు తోడు కావడంతో ఈ విషయం దేశంలో పెను సంచలనంగా మారింది. ఈ అంశం మత స్వేచ్ఛలో భాగమా? కాదా? అన్నది తేల్చడానికే ధర్మాసనం పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా దేశం మొత్తం తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Triple Talaq  Indian Supreme Court  Verdict  

Other Articles