Srijan scam accused dies in Bihar hospital శ్రీజన్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు మృతి..

Mahesh mandal a srijan scam accused dies in bhagalpur hospital

Bhagalpur, Bihar NGO scam, Bihar scam, Manorma Devi, Nitish Kumar, Saharsa, Srijan Mahila Vikas Samiti, mahesh mandal, bihar, cm nitish kumar, srijan scam, deputy cm, sushil modi,

Mahesh Mandal, an accused in the Srijan scam, died in a Bhagalpur hospital on Saturday. Mandal was reportedly suffering from cancer and his kidneys were damaged

శ్రీజన్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు మృతి..

Posted: 08/21/2017 06:52 PM IST
Mahesh mandal a srijan scam accused dies in bhagalpur hospital

బీహార్ రాజకీయాల్లో మళ్లీ వేడి రగిలింది. బీహార్ లో మహాకూటమి బంధాన్ని తెంచుకుని.. ఇటీవలే ఎన్డీయే కూటమి పాలన కొలువుదీరినా.. ఈ రెండు పార్టీల అధ్వరంలో రాష్ట్రంలోని భగల్ పూర్ జిల్లా కేంద్రంగా వెయ్యి కోట్ల రూపాయల 'శ్రీజన్' కుంభకోణం వెలుగుచూసిందని ప్రతిపక్ష పార్టీలు అరోపిస్తున్నాయి. ఇదే అంశమై ఇవాళ అసెంబ్లీని అర్జేడి, కాంగ్రెస్ లు కుదిపేసాయి. స్కామ్‌లో ప్రమేయమున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు.

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగానే, విపక్ష ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. సీఎం నితీష్, డిఫ్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీలకు తెలిసే ఈ స్కామ్ జరిగిందని, ప్రధాన నిందుతులను వారిద్దరూ అండగా నిలిచారని తేజస్వి ఆరోపించారు. తక్షణం నితీష్, సుశీల్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ స్కామ్ భగల్‌పూర్ జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదని, పలు జిల్లాల్లోనూ ఈ స్కామ్ లింక్‌లు ఉన్నాయని అన్నారు.
 
కాగా, ఈ స్కామ్‌లో ప్రమేయమున్న జేడీయూ, బీజేపీ నేతలిద్దరూ రాజీనామా చేయాల్సిందేనని మాజీ సీఎం, ఆర్జేడీ నేత రబ్రీ దేవి సైతం డిమాండ్ చేశారు. 'ఇది మామాలు స్కామ్ కాదు. మెగా స్కామ్' అంటూ రబ్రీ మండిపడ్డారు. నితీష్, మోదీ పదవుల్లో ఉంటే నిష్పాక్షిక దర్యాప్తు సాధ్యం కాదన్నారు. కాగా, ముఖ్యమంత్రి నగర్ వికాస్ యోజన పథకం కింద జాతీయ బ్యాంకుల్లో ప్రభుత్వం నగదు డిపాజిట్ చేయగా, ఆ సొమ్ము భగల్పూర్ జిల్లాలోని శ్రీజన్ మహిళా వికాస్ సహయోగ్ సమితి అనే ఎన్జీవోకు తరలించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలడం వివాదంగా మారింది.

ఇదిలావుండగా, ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న మహేష్ మండల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆయన తీవ్రమైన అనారోగ్యం సమస్యలను ఎదుర్కోవడంతో.. పోలీసులు అయనను భగల్ పూర్ అస్పత్రికి తరలించి చికిత్స అందించినా.. ఫలితం లేకపోవడంతో ఆయన గత శనివారం మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదంతా సీఎం, ఢిప్యూటీ సీఎం కనుసన్నల్లోనే జరుగుతుందని అర్జేడీ నేతలు అరోపణలు గుప్పించి సభ్యలో అందోళనకు దిగారు. దీంతో సభలో గంధరగోళం ఏర్పడటంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh mandal  bihar  cm nitish kumar  srijan scam  deputy cm  sushil modi  

Other Articles