Is your bank account safe and active..? మీ బ్యాంక్ అకౌంట్ సేఫేనా..? చూసుకున్నారా..?

Is your bank account safe and active cross check it now

SBI debit card, card block, permanent blockade, card replacement, Magstripe Debit Cards, security breaches, safety issues, EVM Chip debit cards, netbanking, free of cost, state bank of India, RBI Guide linnes, Reserve Bank of India, bank website

SBI on its website, says that due to security issues and compliance with RBI guidelines, the bank has decided to block magstripe debit cards permanently.

మీ బ్యాంక్ అకౌంట్ సేఫేనా..? చూసుకున్నారా..?

Posted: 08/21/2017 02:59 PM IST
Is your bank account safe and active cross check it now

కేంద్ర ప్రభుత్వం బాటలోనే తాజాగా భారతీయ స్టేబ్ బ్యాంకు కూడా నడుస్తుంది. అనుమానాస్పద ప్యాన్ కార్డులుగా సందేహాలున్న 11 లక్షల పర్మినెంట్ అకౌంట్ నెంబర్ కార్డులను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తరువాత.. ఇటీవల అధార్ కార్డులపై కూడా కేంద్రం వేటు వేసింది. తాజాగా భారతీయ స్టేట్ బ్యాంకు కూడా అదే బాటలో పయనిస్తుంది. తన ఖాతాదారులలో కొందరి డెబిట్‌ కార్డులను శాశ్వతంగా బ్లాక్‌ చేస్తూ ఎస్బీఐ నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే ఈ సమాచారాన్ని కస్టమర్లకు మెసేజ్‌ల రూపంలో అందిస్తోంది.

అయితే తమ ఖాతాదారుల డెబిట్ కార్డులను ఏ కారణంతో శాశ్వతంగా బ్లాక్ చేస్తుందో కూడా ఎస్బీఐ తన వెబ్‌సైట్‌లో వివరించింది. అనుమానాస్పద బ్యాంకు అకౌంట్లు వున్నాయన్నదే కారణమా అంటే ఎంతమాత్రం కాదనే చెప్పాలి. మరి బ్యాంకు అధికారులు జారీ చేసిన కార్డులను నిర్ణీతం కన్నా తక్కువగా వినియోగించడమే కారణమా అంటే.. అది కూడా కాదు. అయితే బ్యాంకు అధికారులు తమ డెబిట్ కార్డులను ఎందుకని శాశ్వతంగా బ్లాక్ చేస్తున్నారన్న సందేహాలు వెంటాడుతున్నాయా..?

దానికి కూడా కారణాలు వున్నాయి. బ్యాంకు అధికారులు గతంలో జారీ చేసిన డెబిట్ కార్డులలో ఉత్పన్నమైన భద్రతా కారణాలే ఈ డెబిట్ కార్డును బ్లాక్ చేయడానికి ముఖ్యకారణం. భద్రతా ప్రమాణాలు అధికంగా కలిగిన ఈవీఎం చిప్ టెక్నాలజీని పోందుపర్చిన డెబిట్‌ కార్డులను బ్యాంకులు తమ కస్టమర్లకు అందించాలని భారతీయ రిజర్వు బ్యాంకు ఇటీవల అదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముందుకు స్టేబ్ బ్యాంకు పలు అకౌంట్లకు చెందిన డెబిట్ కార్డులను బ్లాక్ చేసి.. వారికి ఈవీఎం చిప్‌ పొందుపర్చిన డెబిట్‌ కార్డులను జారీ చేయనుంది.

ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా, భద్రతా కారణాలతో మ్యాగ్‌స్ట్రైప్‌ డెబిట్‌ కార్డును శాశ్వతంగా బ్లాక్‌ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ కార్డులను మార్చుకోవడానికి ఖాతాదారులు వెంటనే బ్యాంకును కాంటాక్ట్‌ చేయాలని లేదా అన్ లైన్ ద్వారా.. బ్యాంకు వెబ్ సైట్ అడ్రస్ www.onlinesbi.com కు చేరుకుని తద్వారా తమ డెబిట్ కార్డులను మార్చుకోవాలని భారతీయ స్టేట్ బ్యాంకు సూచించింది. అయితే ఈ నూతన డెబిట్ కార్డుల కోసం ఖాతాదారులు ఏ ఒక్క పైసాను కూడా వెచ్చించాల్సిన అవసరం లేదు.. వీటిని ఉచితంగానే కస్టమర్లకు అందిస్తోంది.

మ్యాగ్నిటిక్‌ స్ట్రైప్‌ ఆధారిత ఏటీయం డెబిట్‌ కార్డులతో జరుగుతున్న మోసాల నుంచి రక్షించడానికి, ఈవీఎం చిప్‌, పిన్‌ ఆధారిత మోడల్స్‌ను ప్రవేశపెట్టాలని పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి అన్ని బ్యాంకులు, వైట్‌ లేబుల్‌ ఏటీఎం ఆపరేటర్లు.. చిప్‌ కార్డు ఆధారిత ఏటీయం మోడల్స్‌లోకి మారాల్సిందేనని తెలిపింది. డెబిట్‌ కార్డును దగ్గరగా పట్టుకుని చూస్తే, కార్డు వెనుకాల నల్లటి మ్యాగ్నిటిక్‌ స్ట్రిప్‌ ఉంటుంది లేదా ముందువైపు చిప్‌ ఉంటుంది లేదా ఈ రెండూ ఉండొచ్చు. కేవలం నల్లటి స్ట్రిప్ వున్న కార్డులు మోసాలకు అస్కారం ఎక్కువగా వుంటుందని, అందుచేతే ముందుబాగంలో చిప్ సెట్ వున్న డెబిట్ కార్డులను వినియోగంలోకి తీసుకురావాలని అర్బీఐ దేశంలోని బ్యాంకులన్నింటికీ అదేశాలను జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles