BHIM cash back scheme extended till March చిల్లర వ్యాపారులకు కేంద్రం తీసి కబురు

Bhim cash back scheme extended for merchants till march

bhim app, bhim cashback, merchants, narendra modi, prime minister, india goes cashless, cashless economy, NPCI, UPI

The cash back scheme, that offers merchants incentives of up to Rs. 1,000 when they accept payments via BHIM application, has been extended.

చిల్లర వ్యాపారులకు కేంద్రం తీసి కబురు

Posted: 08/21/2017 12:09 PM IST
Bhim cash back scheme extended for merchants till march

దేశంలోని వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. అక్టోబర్ మాసంతో ముగియాల్సిన క్యాష్ బ్యాక్ ఆఫర్ ను మరో ఆరుమాసాల పాటు పొగడిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 8న పాత నోట్ల రద్దు తరువాత ఆ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వెల్లువెత్తినా వ్యతిరేకతే అధికస్థాయిలో వ్యక్తమైన క్రమంలో.. అనూహ్యంగా డిజిటల్ మనీ, క్యాస్ లెస్ ట్రాన్స్ యాక్షన్స్ అన్న నినాదాన్ని ఎత్తుకున్న కేంద్రం.. ఆ దిశగా అడుగులు వేసింది. ఇందుకోసం ఇటు దేశ ప్రజలకు, అటు వర్తకులకు లాభం కలిగించే విధంగా అప్పటికే అందుబాటులో వున్న యాప్ లను కాదని కొత్తగా భీమ్ యాప్ ను తీసుకువచ్చింది.

ఈ భీమ్‌ యాప్ ద్వారా క్యాష్‌ బ్యాక్‌ స్కీమ్‌ కింద వస్తువులు తీసుకునే ప్రజలకు పెద్దగా లాభం లేకపోయినా.. వ్యాపారులకు మాత్రం లాభాన్ని కలిగిస్తుంది. వ్యాపారులు కూడా డిజిటల్ లావాదేవాలకు మొగ్గచూపితే తప్ప మార్పు రాదని భావించిన కేంద్రం.. వారికి ఈ యాప్ ద్వారా జరిగిన లావాదేవీలకు ప్రోత్సహాకాలను కూడా వర్తింపజేస్తుంది. అయితే ఈ యావ్ వినియోగంపై విసృత ప్రచారం జరగకపోవడంతో అశించన మేరకు ఫలితాలు మాత్రం రావడం లేదు. ఈ అక్టోబర్ మాసంతో ఈ యాప్ ద్వారా ఇచ్చే ప్రోత్సహకాలు ముగుస్తున్న కారణంగా.. కేంద్రం దీనిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించి ప్రోత్సాహకాలను మరో అరు మాసాల పాటు పొడిగించింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ఈ ఏడాది ఏప్రిల్‌ 14న అందరికీ అందుబాటులోకి వచ్చిన భీమ్ యాప్.. 2018 మార్చి 31 వరకు భీమ్ క్యాష్ బ్యాక్ స్కీమ్ లను అందించనుంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ యాప్ ద్వారా కేంద్రం ప్రోత్సాహకాలను క్యాష్ బ్యాక్ ఆఫర్ ద్వారా అందిస్తుంది. ఈ స్కీమ్‌ కింద ఒక్కో లావాదేవీకి రెండు రూపాయల చోప్పున కేంద్రం వీరికి క్యాప్ బ్యాక్ అందిస్తుంది. భీమ్‌ క్యాష్‌ బ్యాక్‌ స్కీమ్‌ నెలవారీ పరిమితి వెయ్యి రూపాయలు. ఈ క్యాష్‌బ్యాక్‌ ప్రయోజనాలను వర్తకులు పొందడానికి, భీమ్‌ యూనిక్‌ యూజర్ల నుంచి వర్తకులు ప్రతి నెలా కనీసం 20 లావాదేవీలు జరుపాల్సి ఉంటుంది. కాగా ప్రతి లావాదేవీ కనీసం రూ. 25కు పైగానే వుండాలన్న నిబంధన కూడా వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles