రేపు బ్యాంకులు బంద్.. పనులుంటే ఇవాళే చేసుకోండి | Talks fail, banks going ahead with August 22 strike

Bank unions strike on august 22 all over india

Bank Strike, August 22 Bank Strike, Bank Unions Talks Fail , Bank One Day Service, Banks One Day Strike, All Indian Banks Strike, Banking Reforms Protest, Banking Reforms Strike

Bank unions of Public Sector Banks to go on strike on August 22 to protest against proposed reforms. Bank services may be affected. Private Banks like Axis, HDFC not participate in this strike.

చర్చలు విఫలం.. బ్యాంకులు బంద్

Posted: 08/21/2017 11:43 AM IST
Bank unions strike on august 22 all over india

దేశవ్యాప్తంగా రేపు బ్యాంకుల సమ్మె ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆగష్టు 22 ఒక్క రోజు సమ్మె చేపట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నాయి. తమ డిమాండ్ల సాధనకు మంగళవారం దేశవ్యాప్తంగా సమ్మె తలపెట్టినట్లు సమాచారం.

ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ప్రక్రియతోపాటు పలు సంస్కరణలను వీరు ఎప్పటి నుంచో తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి మొండి బకాయిలుగా మారిన రుణాలను రద్దు చేయాల్సిన అవసరం లేకుండా చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే, రుణ ఎగవేతను నేరపూరిత చర్యగా ప్రకటించాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చల్లో అంగీకారం కుదరకపోవడంతో సమ్మె యథావిధిగా రేపు కొనసాగుందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.

వీరి సమ్మె కారణంగా సాధారణ బ్యాంకు సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. ప్రైవేటు బ్యాంకులైన ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహింద్రా బ్యాంకు సేవలు మాత్రం యథావిధిగా పనిచేయనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bank Strike  Banking Reforms  Bank Unions Talks Fail  

Other Articles