India beat Sri Lanka by 9 wickets in first ODI విక్టరీతో వన్డే సిరీస్ ప్రారంభించిన టీమిండియా

India vs sri lanka 1st odi dhawan kohli give ind crushing win

India vs Sri Lanka, Ind vs SL, ODI cricket, IND vs SL, Indian cricket team, Virat Kohli, Sri Lanka cricket team, Axar Patel, Shikhar Dhawan indian cricket news, cricket news, sports news, latest news, sports, cricket

Shikhar Dhawan blasted a magnificent 132 while Virat Kohli chipped in with a brilliant 82* as their 197-run stand helped India crush Sri Lanka by nine wickets in the Dambulla ODI to go 1-0 up in the five-match series.

విక్టరీతో వన్డే సిరీస్ ప్రారంభించిన టీమిండియా

Posted: 08/21/2017 07:34 AM IST
India vs sri lanka 1st odi dhawan kohli give ind crushing win

దంబుల్లా వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. 217 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోయి ఛేదించింది. 28.5 ఓవర్ లలో 220 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(132), కోహ్లీ(82) సూపర్ ఇన్నింగ్స్ తో 9 వికెట్ల తేడాతో భారత్ కు విజయం సొంతమైంది. ఓపెనర్ రోహిత్ శర్మ(4) త్వరగానే రనౌట్ అయినా.. చక్కని భాగస్వామ్యంతో  విజయాన్ని అందించారు. ధావన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

అంతకు ముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది కోహ్లీ సేన. బౌలర్లు సమష్టిగా రాణించడంతో 216 పరుగులకే లంక టీమ్ ను ఆలౌట్ అయ్యింది. తొలి పది ఓవర్లు జోరుగా ఆడిన లంకేయులు… 74 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయారు. చాహల్ బౌలింగ్ లో గుణతిలక అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 139 పరుగుల దగ్గర కేదార్ జాదవ్ బౌలింగ్ లో నిరోషన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 150 పరుగుల దగ్గర మెండీస్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటవెంటనే ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు చేరారు.

కేదార్‌ జాదవ్‌ వేసిన 32.2వ బంతికి కెప్టెన్ ఉపుల్‌ తరంగ (13) భారీ షాట్‌ ఆడాడు. గాల్లోకి లేచిన బంతిని లాంగాన్‌లో ధావన్‌ క్యాచ్ పట్టాడు. 33.2వ బంతికి లేని పరుగుకు ప్రయత్నించిన కపుగెదెర (1)ను కోహ్లీ అద్భుతంగా రనౌట్‌ చేశాడు. ఇక అక్షర్‌పటేల్‌ వేసిన 34.2వ బంతికి హసరంగ (2) కేదార్‌ జాదవ్‌ చేతికి చిక్కాడు. 35 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 177/6తో ఉంది.  తిసార పెరీరా (0) డకౌట్ అవ్వగా.. తర్వాత వచ్చిన లక్షన్ 5 పరుగులు జోడించి అక్షర్ పటేల్ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. చాహల్ బౌలింగ్ లో మలింగ(8) ఔట్ అవ్వగా.. బూమ్రా బౌలింగ్ లో ఫెర్నాండో డకౌట్ అయ్యాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీసుకోగా, జాదవ్, చాహల్, బూమ్రా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  TeamIndia  Virat Kohli  shikhar dhawan  cricket  

Other Articles