Death toll rises to 105 in Gorakhpur hospital tragedy ‘ఘో’రక్ పూర్ లో అగని చిన్నారుల మరణాలు..

Nine more children die in gorakhpur s brd medical college toll at 105

Gorakhpur deaths, Gorakhpur, Yogi Adityanath, BRD medical college, Child deaths, Encephalitis, Rahul Gandhi, Uttar Pradesh,

More deaths are continuing to occur at the Baba Raghav Das Medical College that is in the eye of a storm over allegations that disrupted oxygen supply led to the tragedies.

‘ఘో’రక్ పూర్ లో అగని చిన్నారుల మరణాలు..

Posted: 08/19/2017 05:16 PM IST
Nine more children die in gorakhpur s brd medical college toll at 105

ఉత్తరప్రదేశ్ గోర‌ఖ్‌పూర్‌లోని బాబా రాఘవ దాస్ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో అక్సిజన్ సిలిండర్ల కోరతతో చిన్నారుల మరణం సంభవించలేదని ఏకంగా అధికార యంత్రాంగం నివేదిక వెల్లడించినా.. ఇంకా అదే కారణంగా నూరేళ్ల జీవితాన్ని అనుభవించాల్సిన భావిభారత పౌరులు పదేళ్లు కూడా నిండి నిండకుండానే చిన్నారి ప్రాణాలు అనంతవాయువుల్లో కలుస్తున్నాయి. మరెందరో చిన్నారుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి.

బీఆర్డీ అస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న‌ చిన్నారుల్లో ఈ నెల‌ 10 నుంచి 11 వరకు 48 గంటల్లో 30 మంది ఆక్సిజన్ అందక మృతిచెందడం విషయం వెలుగుచూడడంతో సంచలనంగా మారింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా చిన్నారుల మృతిపై చర్యలు తీసుకుంది. కమిటీని వేసి చిన్నారుల మృతికి కారణాలను వెలికి తీయాలని అదేశించింది. అయితే ఓ వైపు కమిటీ తన విచారణ సాగిస్తున్నా.. ఇటు చిన్నారుల మరణాలు మాత్రం అగడం లేదు. బీఆర్డీ అస్పత్రిలో చిన్నారుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో నిత్య విషాదం ప్రాంతంగా మారిపోయింది.

ఈ నేపథ్యంలో విపక్షాలకు చెందిన పార్టీ నేతలు ఆస్పత్రికి చేరుకుని మృతిచెందిన చిన్నారుల తల్లిదండ్రులను పరామర్శిస్తున్నారు. వైద్యుల పనితీరుపై, అక్సిజన్ కాంట్రాక్టులో అవకతవంకలపై విమర్శలు చేస్తున్నారు. అయినా అస్పత్రి వర్గాల్లో మాత్రం ఏమాత్రం మార్పు కనపించడం లేదు. గడిచిన 24 గంటల్లో మరో 9 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయార‌ని ఆ ఆసుప‌త్రి వైద్యులు ప్ర‌క‌టించడం కూడా ఒక కారణంగా మారింది. దీంతో భీఆర్డీ అస్పత్రిలో ఇప్ప‌టివ‌ర‌కు మృతిచెందిన‌ చిన్నారుల సంఖ్య 105కి చేరింది. ఈ 11 మంది చిన్నారులు నియోనాటల్ (నవజాత శిశువు), ఏన్సెఫలైటిస్ (మెదడు వాపు వ్యాధి), సాధారణ వార్డుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్లు వివ‌రించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles