viral: schoolkids from flooded Assam salutes national flag స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఈ ఫోటోనే వైరల్ ఇదే..

Schoolkids from flooded assam saluting the national flag is going viral

independence day, 70 years of independence, assam floods, assam floods photos, assam floods latest photos, assam floods independence photos viral facebook, assam primary school I-day celebrations, flag hoisting at assam primary school, Mizanur Rahman, Lower Primary School, assam floods, Naskara, assam, viral photos, photos viral

The beautifully lit monuments and kites soaring high, it is a photo of kids at a school in Assam saluting the National Flag that is breaking the Internet.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఈ ఫోటోనే వైరల్ ఇదే..

Posted: 08/18/2017 12:37 PM IST
Schoolkids from flooded assam saluting the national flag is going viral

దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్న వేళ.. దేశాంలో ఎన్నో ప్రతికూల అంశాలు కూడా ప్రభావితం చాటాయి. మరీ ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ కొండ చరియలు విరిగిపడిన ఘటన, గోరక్ పూర్ లో 70 మంది చిన్నారులు మరణించిన విషాదంతో పాటు.. ఇక దేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్ష బీభత్సంతో వరదలు ఉప్పోంగి అనేక ప్రాంతాలను ముంపుకు గురిచేశాయి. ఈ క్రమంలో వచ్చిన జాతీయ పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రకృతి వైపరిత్యం కూడా అడ్డుగా నిలవగా, ఆ పాఠశాల మాస్టారు మాత్రం తనదైన శైలిలో జాతీయ జెండాను అవిష్కరించి.. నెట్ జనులు మన్నన్నలను పోందుతున్నాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారి నెట్ జనులు లైక్ లను పోందుతున్న ఈ ఫోటో వైరల్ అవుతోంది. అసోంను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. నడుంలోతు నీళ్లలో ఉన్న ఓ పాఠశాలలో జరిగిన పంద్రాగస్టు వేడుకలకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లక్షల్లో నెటిజన్లు ఆ ఫొటోను లైక్‌ కొట్టి షేర్‌ చేస్తూ ప్రశంసిస్తున్నారు. దాని వివరాల్లోకివెళ్తే...అసోంలోని ధుబ్రి ప్రాంతంలోని నష్కర ప్రాథమిక పాఠశాలలో జెండా ఎగురవేశారు. జెండా వందన కార్యక్రమానికి ఓ ఉపాధ్యాయుడు, ముగ్గురు విద్యార్థులు హాజరయ్యారు.

వారిలో ఇద్దరు చిన్నారుల భుజాల వరకు వరద నీరు ఉన్నప్పటికీ వాళ్లు మాత్రం జెండా వందనం చేస్తూ నిలబడ్డారు. దీని గురించి ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు మిజనూర్‌ రెహమాన్‌ వివరిస్తూ, సంబంధిత ఫొటోను ఫేస్‌ బుక్‌ లో పోస్టు చేశారు. ‘ప్రస్తుతం మేము ఎలా ఉన్నామనేది చెప్పలేము.. ఈ ఫొటోనే చెబుతుంది’ అని ఆయన రాసుకొచ్చారు. ఆ రాష్ట్ర నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో జరిగే ప్రతీ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను, ఫొటోలతో సహా తీసి విద్యాశాఖకు పంపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి, జిల్లా విద్యాధికారికి పంపారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్షల్లో లైకులు, షేర్లు, కామెంట్లతో దూసుకుపోతోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles