Deadly Van Attack in Barcelona Leaves 13 Dead బార్సిలోనాలో ఉగ్రపంజా.. వ్యూహం మార్చిన ఐసిస్

Deadly van attack in barcelona leaves 13 dead 100 injured

Van Attack in Barcelona, Van mowed down pedestrians in Barcelona, barcelona, barcelona van, van attack barcelona, las ramblas barcelona, spain van, van crash barcelona, las ramblas, spain van crash, spain, piucturesque, tourinst point, killing zone, ISIS

A van veered onto a promenade and barreled down the busy walkway in central Barcelona, as it mowed down pedestrians and turned a picturesque tourist destination into a bloody killing zone.

బార్సిలోనాలో ఉగ్రపంజా.. వ్యూహం మార్చిన ఐసిస్

Posted: 08/18/2017 09:33 AM IST
Deadly van attack in barcelona leaves 13 dead 100 injured

స్పెయిన్‌ ప్రధాన పట్టణమైన బార్సిలోనా మరో మారు ఉగ్రవాదులు తెగబడ్డారు. పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలను కబళించి.. వందల సంఖ్యలో బాటసారులను గాయాపర్చారు. అయితే ఫ్రాన్సు తరహలోనే ఇక్కడ కూడా వ్యవూహాన్ని మార్చి.. కొత్త ఎత్తుతో ప్రజల ప్రాణాలను హరించారు. దీంతో పర్యాటక కేంద్రంగా బాసిల్లుతూ.. అనునిత్యం రద్దీగా వుండే పిక్చర్ స్క్యూ ఉగ్రదాడితో రక్తమోడింది. నిన్న మొన్నటి వరకు బాంబులు, తుపాకులతో దాడులు చేసే ఉగ్రవాదులు వ్యూహం మార్చారు. మారణాయుధాలుగా వాహనాలను ఎంచుకుంటున్నారు.

అనునిత్యం రద్దీగా ఉండే పిక్చర్ స్క్యూ  పర్యాటక కేంద్రంలోని రోడ్లపై వాహనాలతో స్వైరవిహారం చేస్తూ.. జనాలపైకి పోనిస్తూ.. పదుల సంఖ్యలో ప్రాణాలు బలిగొన్నారు. బార్సిలోనాలోని రద్దీగా ఉండే లస్‌ రంబ్లస్‌ రహదారిలో ఐఎస్ఐఎస్ కు చెందిన ఉగ్రవాదులు వ్యాన్ తో జనాలపైకి దూసుకుపోయారు. వ్యాన్ల వెనక్కు ముందుకు పలుమార్లు తిరగిడంతో దాని నుంచి తప్పించుకునే క్రమంలో వందలాది మంది గాయాలపాలయ్యారు. అయితే ఉగ్రవాదుల వాహనం ఢీకొనడంతోనే లేక తొక్కిసలాట కారణంగానే 13 మంది అసువులు బాసారు.

దీంతో అప్పటివరకు ఆహ్లాదకరంగా ఉన్న ఆ రహదారి ఆర్తనాదాలు, ఉరుకులు పరుగులతో గందరగోళంగా మారింది. ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. తెల్లని వ్యాన్ దూసుకొచ్చిందని, దాని ధాటికి జనాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొని ప్రణాళిక రచించారని, ఒక వ్యక్తి దాడికి పాల్పడగా, రెండో వ్యక్తిని కాటలోనియాలోని విక్ పట్టణంలో పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ దాడి తమ వాళ్లే చేశారని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : barcelona  van  van attack barcelona  spain  piucturesque  tourinst point  killing zone  ISIS  

Other Articles