హార్ట్ సిటీగా మారిన హైటెక్ సిటీకి అత్యంత సమీపంలో విలాసవంతమైన ప్లాట్లను నిర్మించి.. విక్రయించిన లోధా అపార్టుమెంట్ల బిల్డర్.. తమను మోసం చేశారని ఫ్లాట్ ఓనర్లు ఇవాళ కూకట్ పల్లిలో అందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమకు ఫ్లాట్లను విక్రయించే సమయంలో ఇచ్చిన హామీలను కాలరాస్తూ.. వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని దీని వల్ల తాము అనేక విదాలుగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారు వాపోయారు. ఈ అపార్టుమెంట్ల సముదాయంలో నటుడు జగపతిబాబుతో పాటు నటి శ్రియా సారెన్, పలువురు వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రముఖులు కూడా వున్నారు.
అందోళన నేపథ్యంలో సినీ నటుడు జగపతి బాబు మీడియాతో మాట్లాడుతూ కుకట్ పల్లిలోని లోధా అపార్టుమెంట్ల బిల్డర్ తమను మోసం చేశాడని ఆరోపించారు. లోధా గేటెడ్ కమ్యూనిటీ హై అండ్ అపార్టుమెంట్ల పేరిట మూడు కోట్ల రూపాయల ఖరీదుగా చెప్పి.. తరువాత వివిధ కారణాలతో తమ నుంచి 4 కోట్ల చొప్పున వసూలు చేశారని చెప్పారు. కాగా, ఇప్పుడు తమ అపార్టుమెంట్ల పక్కనున్న అపార్టుమెంట్లను కలుపుతామని బిల్డర్ అంటున్నాడని ఇది తమను మోసం చేయడమేనని అయన అన్నారు.
పక్కనున్న అపార్టుమెంట్లు కలిపితే.. తమ గేటెడ్ కమ్యూనిటీలోని అమినిటీస్ అన్నింటినీ వారు కూడా వాడుకునే వెసలుబాటు లభిస్తుందని, దీంతో నాలుగు కోట్ల రూపాయల ధర పెట్టిన తమకు.. ఎక్కడ న్యాయం జరిగినట్లని ఆయన ప్రశ్నించారు. బిల్డర్ తనకు నచ్చినట్టు చేయడానికనేనా తము హై ఎండ్ అపార్టుమెంట్లను కొనుగోలు చేసి నివాసాలుగా ఏర్పాటు చేసుకుందని ఆయన నిలదీశారు. తాము ప్లాట్లు కొన్న సమయంలో బిల్డర్ ఇచ్చిన హామీలకు అనుగూణంగానే ఇప్పుడు కూడా వ్వవహరించాలని ఆయన కోరాడు. పక్కనున్న అపార్టుమెంట్లను తమ గేటెడ్ కమ్యూనిటీలో ఎలా కలపుతారని, ఇది నిబంధలనకు పూర్తి విరుద్దమని ఆయన అక్షేపించారు.
లోధా అపార్టుమెంట్లలో సుమారు ఏడు వేలకు పైగా అపార్టుమెంటు వాసులు ఉంటున్నారని, అంతా హైఎండ్ అపార్టుమెంట్ల పేరుతోనే ఈ అపార్టుమెంట్లను కొన్నారని ఆయన చెప్పారు. లోధా అపార్టుమెంట్ల బిల్డర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ విలాసవంతమైన బహుళ అంతస్థుల సముదాయంలోని వారంతా ఏకమయ్యారని, బిల్డర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. తమ ఇష్టానుసారంగా పక్కనున్న అపార్టుమెంట్లను తమ గేటెడ్ కమ్యూనిటీలో కలిపితే రక్షణ అసాధ్యమన్నారు. ప్రశాంతత కోసమే ఎవరైనా గేటెడ్ కమ్యూనిటీని కోరుకుంటారన్నారు. బిల్డర్ తన నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేకపోతే ఏం చేయాలో, ఎలా చేయాలో తమకు తెలుసునని జగపతి బాబుతో పాటు ఫ్లాటు ఓనర్లు బిల్డర్ కు హెచ్చరికలు జారీ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more