Government caps price of knee-replacement devices ఇక కార్పోరేట్ అసుపత్రుల దోపిడికి కళ్లేం..!

Knee implants price capped saving to patients rs 1 500 cr says govt

Chemicals and Fertilisers Minister Ananth Kumar, government, Knee implants, National Pharmaceutical Pricing Authority, NPPA, price capped, prices of knee surgery, Prime Minister Narendra Modi, 2 crore patients, 1,5 knee joint replacement surgeries, corperate hospitals

The government capped prices of knee implants at a significantly lower rate than current market rates, a move that could result in savings of Rs 1,500 crore annually to patients requiring surgery.

కార్పోరేట్ అసుపత్రుల దోపిడికి కళ్లేం..!

Posted: 08/17/2017 11:38 AM IST
Knee implants price capped saving to patients rs 1 500 cr says govt

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పోరేట్ దిగ్గజాలకు సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ వారి సంక్షేమం కోసమే పనిచేస్తుందన్న విమర్శల నేపథ్యంలో ఎట్టకేలకు స్పందించింది. దేశంలోని సుమారు 122 కోట్ల జనాభాలో దాదాపుగా రెండు కోట్ల మంది బాధపడుతున్న అంశంలో కేంద్ర మంత్రి అనంత్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఏడాదికి దేశవ్యాప్తంగా లక్షన్నర మంది మోకాలి చిప్పల మార్పిడి చేయించకుంటున్న క్రమంలో ఈ అంశాన్ని కేంద్రమంత్రి సీరియస్ గా తీసుకున్నారు.

మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల్లో ఉపయోగించే కృత్రిమ మోకాలి చిప్పల ధరలను గణనీయంగా తగ్గించిన కేంద్రం.. ఇకపై కార్పోరేట్ అసుపత్రులు బాధితుల నుంచి అధికమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న అరోపణలు వున్నాయని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ అన్నారు. ఇకపై ఇలాంటి వాటికి అస్కారం ఉండకూడదని అదేశించారు. మోకాలి చిప్పల మార్పిడి శస్త్రచికిత్స విషయంలో బాధితుల నుంచి అధికమొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పిర్యాదులు అందితే సదరు అస్పత్రులపై కఠిన చర్యలు తప్పవని ఆయన అదేశించారు.

వాస్తవ ధరల కన్నా ప్రైవేటు వైద్యశాలలు లక్ష రూపాయల మేర అధికంగా ధరలు వసూలు చేస్తుండటంతో వీటి ధరలపై ప్రభుత్వం గరిష్ట పరిమితిని విధించింది. కేంద్రం తాజా ఉత్తర్వులతో కృత్రిమ మోకాలి చిప్పలు 70% తగ్గి… రకాన్ని బట్టి రూ.54 వేల నుంచి గరిష్టంగా రూ.1.14 లక్షల వరకు ఉండనున్నాయి. అక్రమంగా, అన్యాయంగా ప్రైవేటు వైద్యశాలలు రోగులను దోచుకుంటూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పారు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత్‌ కుమార్‌.

కొత్త ధరల ప్రకారం ప్రస్తుతం విస్తృతంగా వాడే కోబాల్ట్‌–క్రోమియం కృత్రిమ మెకాలి చిప్ప ధర రూ.54,720. ఇప్పటి వరకు ఆసుపత్రులు దీనికి రూ. 1.6 లక్షల వరకు వసూలు చేస్తుండేవి. 80% శస్త్రచికిత్సల్లో ఈ రకం మోకాలి చిప్పలనే వాడుతున్నారు. క్యాన్సర్, కణతిలతో బాధపడుతున్న రోగులకు వాడే ప్రత్యేక మోకాలి చిప్పల ధరను ప్రభుత్వం రూ.1,13,950గా నిర్ణయించింది. కొత్త ధరల కన్నా అధికంగా డబ్బులు వసూలు చేస్తే ఆసుపత్రులు, దిగుమతిదారులు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి అనంత్‌ కుమార్‌ హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles