Sushmita Sen to appear before Chennai court మాజీ విశ్వసుందరికీ మద్రాసు హైకోర్టు నోటీసులు

Car import case hc directs sushmita sen to appear in court

Madras high court, Sushmita Sen, Miss Universe, Haren Choksey, luxury car import, foreign trade policy, Economic Offences Court, Justice R Suresh Kumar, Customs Department, Directorate of Revenue Intelligence (DRI), Bollywood

The Madras High Court today directed Bollywood actress Sushmita Sen to depose as a witness before a trial court in Chennai on September 18 in a case related to import of a luxury car in alleged violation of foreign trade policy rules.

బాలీవుడ్ నటికి మద్రాసు హైకోర్టు నోటీసులు

Posted: 08/17/2017 10:29 AM IST
Car import case hc directs sushmita sen to appear in court

ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ కు మద్రాసు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అమెను విచారణకు హాజరుకావాల్సిందిగా మద్రాసు హైకోర్టు అదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.  విదేశాల నుంచి అమె తెప్పించుకున్న లగ్జరీ కారుకు సంబంధించి అమె అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలపై కస్టమ్స్ డిపార్టుమెంటు తో పాటు, డైరెక్టరేట్ అప్ రివెన్యూ ఇంటెలిజెన్స్ విభాగాలు అమెపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో అమెను మద్రాసులోని దిగువ కోర్టులో విచారణకు హాజరుకావాల్సిందిగా మద్రాసు రాష్ట్రోన్నత న్యాయస్థానం అదేశించింది. విదేశాల నుంచి అమె ఇంపోర్టు చేసుకున్న లగ్జరీ కారు సంబంధించిన కేసులో అమెను విచారణకు హాజరుకావాల్సిందిగా న్యాయమూర్తి జస్టిస్ అర్ సురేష్ కుమార్ అదేశాలిస్తూ నోటీసులను జారీ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. సుస్మితా సేన్ 2008లో విదేశాల నుంచి ఒక విలాసవంతమైన కారును తెప్పించుకున్నారు. ఓడలో చెన్నై పోర్టుకు చేరుకున్న ఆ విలాసవంతమైన కారును నిబంధనలకు విరుద్ధంగా ఆమె తీసుకున్నారని ఆరోపిస్తూ కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు ఎగ్మూర్ ఆర్థిక నేరాల న్యాయస్థానంలో కేసు నమోదు చేశారు. ఈ కోర్టులో జరిగిన విచారణకు ఆమె హాజరుకాలేదు. దీనిపై జూన్ లో ఆ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ సుస్మితా సేన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై గత నెల 20 కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించిన మద్రాసు రాష్ట్రోన్నత న్యాయస్థానం.. ఈ కేసును ఇవాల విచారించి.. సెప్టెంబర్ 18న జరగనున్న విచారణకు కింది కోర్టులో హాజరుకావల్సిందగా అదేశాలను జారీ చేసింది. అదే రోజున కేసు సాక్షాలను, క్రాస్ ఎగ్జామినేషన్ సహా అన్నింటినీ పూర్తి చేయాలని కూడా న్యాయమూర్తి సురేష్ కుమార్ అదేశించారు. సుస్మీతా సేన్ న్యాయస్థానికి విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో అమెతో పాటు అమె సంబంధిత వస్తువులకు కూడా భధ్రత, రక్షణ కల్పించాలని మద్రాసు హైకోర్టు పోలీసులను అదేశించింది.

అసలు కేసు ఏమిటంటే అమె విదేశాలలోని హరెన్ చౌక్సీ అనే వ్యక్తి నుంచి తెప్పించుకున్న విలాసవంతమైన కారు నిబంధనలకు విరుద్దమని కస్టమ్, డీఆర్ఐ అధికారులు ఈ కేసును నమోదు చేశారు. కారును విదేశాల నుంచి తెప్పించుకున్న క్రమంలో అమె 2004లో తయారైన కారును 1998లో తయారైనట్లుగా చూపించి కస్టమ్ డ్యూటీగా చెల్లించాల్సిన మొత్తాన్ని ఎగవేశారని అభియోగాలు నమోదు చేశారు. దీనికి తోడు అమె కారు ఛాసిస్ నెంబరును కూడా మర్చేసి కారు విలువను తగ్గేలా చేశారని కేసులో కస్టమ్స్ అధికారులు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madras high court  Sushmita Sen  Miss Universe  Haren Choksey  luxury car import  Bollywood  

Other Articles