Barack Obama's Charlottesville tweet the most liked ever లైకుల సునామీలో మునిగితేలుతున్న ఒబామా..

Barack obama s post charlottesville tweet is the most liked in history

Barack Obama, Barack Obama's tweet, Charlottesville, Violence, Virginia, Twitter, Nelson Mandela quote, US, Former US President

Former US President Obama tweeted a quote from former South African President Nelson Mandela in response to the violence in Charlottesville in Virginia.

లైకుల సునామీలో మునిగితేలుతున్న ఒబామా..

Posted: 08/16/2017 06:57 PM IST
Barack obama s post charlottesville tweet is the most liked in history

అగ్రారాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇప్పుడు అంతర్జాలంలో చరిత్ర సృష్టిస్తున్నారు. కనీవిని ఎరుగని రీతిలో అయన చరిత్ర సృష్టిస్తున్నాడు. ట్విటర్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫిదా అయిపోయారు. దీంతో ఆయన లైకుల సునామీలో మునిగి తేలుతున్నారు. ట్విట్టర్ చరిత్రలో ఎవరికీ లభించనన్ని లైకులు, రీట్విట్లు, కామెంట్లను.. ఆయన అందుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా అదేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాల ప్రజల మనస్సులను గెలిచిన ఒబామా.. పదవి నుంచి తప్పుకున్న తరువాత ఏకంగా ట్విట్ఱర్ హీరో అయ్యారు.

అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలోని చార్లోటస్ విల్లే లో చోటు చేసుకున్న జాతి వివక్ష దాడులపై ఒబామా స్పందించారు. దాడులను ఖండిస్తూ ఆయన పెట్టిన ట్విట్ ఇప్పడు అమెరికాతో పాటు ప్రపంచ దేశాల నెట్ జనులను ఆకర్షిస్తుంది. అత్యధిక లైక్‌లు పొందిన పోస్టుల్లో ఒకటిగా చరిత్ర సృష్టించి ఇక ట్విట్టర్ చరిత్రలో తనకు సాటి ఎవరూ లేనన్నట్లుగా కొనసాగుతుంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ‘‘పుట్టేటప్పుడు ఎవరూ ఇతరులను ద్వేషిస్తూ జన్మించలేదు. చర్మం రంగు, నేపథ్యం, మతాన్ని బట్టి వివక్ష చూపించడం పుట్టుకతో వచ్చినది కాదు..’’ అని వ్యాఖ్యానించారు.

ధక్షిణాఫ్రికా నల్లసూరీడు నెల్సన్ మండేలా జీవితచరిత్ర ‘లాంగ్ వాక్ టు ఫ్రీడమ్’ నుంచి ఆయన ఒబామా ఈ వ్యాఖ్యలను కోట్ చేస్తూ.. తన అభిమతాన్ని చాటారు. అక్కడితో వదిలిపెట్టకుండా గతంలో రకరకాల వర్ణాలతో ఉన్న పిల్లలతో తాను దిగిన ఫోటోను ఆయన సామాజిక మాద్యమంలో తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్టు చేశారు. ఈ నెల 12న ఆయన పోస్టు పెట్టగా... ఇప్పటికే దాదాపు 33 లక్షల మంది లైక్ చేశారు. 52 వేల మందికి పైగా కామెంట్లు రాశారు. 13 లక్షల మందికి పైగా రీట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles