Around 81 lakh Aadhaar cards deactivated మీ అధార్ నెంబరు పనిచేస్తుందా..? చూసుకోండిలా..!

After pan govt now deactivates millions of aadhaar cards

Aadhaar, aadhaar deactivated, governmant, India, PAN, PAN deactivated, step by step guide, validity, aadhar card, pan cards, deactivation, unique identification authority of india, 81 lakh aadhaar numbers, aadhar card number

The Unique Identification Authority of India has deactivated close to 81 lakh Aadhaar numbers till date, Minister of State for Electronics and IT P P Chaudhary said

మీ అధార్ నెంబరు డీయాక్టివేట్ అయ్యిందా..? చూసుకోండిలా..!

Posted: 08/16/2017 06:05 PM IST
After pan govt now deactivates millions of aadhaar cards

దేశ ప్రజలకు చెందిన 11 లక్షల పర్మినెంట్ అకౌంట్ నెంబరు (పాన్) కార్డులను డీయాక్టివేట్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం.. తాజాగా మరో నిర్ణయం కూడా తీసుకుని దేశ ప్రజలను విస్మయానికి గురిచేసింది. ఓ వైపు అధార్ కార్డులను దేశపౌరులందరూ తీసుకోవాలని ప్రచారం చేస్తూనే.. మరో వైపు ఏకంగా 81 లక్షల అధార్ కార్డులను డీయాక్టివేట్ చేసింది. అధార్ కార్డుల జారీలో కొందరు అవకతవకలకు పాల్పడి అక్రమంగా పొందారన్న అనుమానాలు వున్న 81 లక్షల కార్డులను డీయాక్టివేట్ చేసింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆధార్ సంఖ్యను జారీ చేయాలన్న లక్ష్యంతో ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.

కాగా, ఇప్పటి వరకు 111 కోట్ల ఆధార్ కార్డులు జారీ కాగా, ఇంకా అనేక మంది అధార్ కార్డుల కోసం బారులు తీరుతునే వున్నారు. ఆధార్ కార్డు వల్ల పన్నుల ఎగవేత, నల్లధనాన్ని పోగేసుకోవడం వంటి అక్రమాలను నిరోధించవచ్చునని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో అక్రమంగా జారీ అయిన అధార్ కార్డులను నిలిపేసింది. అయితే వివిధ కారణాలను చూపుతూ ప్రభుత్వం 81 లక్షల ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేసింది. మరి ఇందులో మీ ఆధార్ నెంబరు వుందా.,? అన్న అనుమానాలకు తావులేకుండా వెంటనే చెక్ చేసుకోండి.
 
చెక్ చేసుకునే విధానం:-

యూఐడీఏఐ వెబ్‌సైట్ https://uidai.gov.in లో లాగ్ ఆన్ అవాలి. దానిలోని ఆధార్ సర్వీసెస్ ట్యాబ్‌ క్రింద ‘వెరిఫై ఆధార్ నంబర్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో రెండు బాక్స్‌లు ఉంటాయి. ఒకదానిలో ఆధార్ సంఖ్యను టైప్ చేయాలి. రెండోదానిలో ఆ బాక్స్ పక్కనే ఇచ్చిన సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం మరొక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో పరీక్షిస్తున్న ఆధార్ సంఖ్య మనుగడలో ఉందా, లేదా? అనే విషయాన్ని వివరిస్తుంది. వ్యక్తి వయసు పదుల సంఖ్యలో తెలియజేస్తుంది. ఫోన్ నంబరు చివరి మూడు అంకెలు కనిపిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles