Bengaluru Sees Heaviest Rainfall Since 1890 నాలుగే గంటలు.. నిండరా మునిగిన నగరం..

Bengaluru sees heaviest rainfall since 1890

Bengaluru, heavy rain, flood, appartments, Meteorological Department, Natural disasters and extreme weather, monsoon season, forecast, prediction, karnataka

Bengaluru witnessed the heaviest downpour in August in over 100 years as it record180 mm rainfall in barely three hours

ITEMVIDEOS: నాలుగే గంటలు.. నిండరా మునిగిన నగరం..

Posted: 08/16/2017 04:04 PM IST
Bengaluru sees heaviest rainfall since 1890

బెంగుళూరు నగరవాసులు యధావిధిగా తమ పనులు ముగించుకుని పడుకున్నారు. నిద్రలోకి జారుకున్న నగరాన్ని వరుణుడు తట్టి లేపాడు. పగలంతా అలసిపోలసి రాత్రి విశ్రాంతి తీసుకునేవాళ్లు గాడనిద్రలోకి జరుగున్న సమయంలో ఎంత తట్టినా మాత్రం లేస్తారా.. తమ మత్తు కళ్ల ముందు ఎన్నెన్నో స్వప్నాలు సాక్ష్యాతర్కమవుతుంటాయి. ఇలా వాటిని తోసి రాజుతూ.. కోయిల గానాలకు, పక్షుల కిలకిలా రాగాలకు బదులు నీళ్ల శబ్దం.. అందులోనూ తాము ఇంట్లో వున్నా సముద్ర ప్రయాణం చేస్తున్నట్లుగా అనిపించేలా మారిన శబ్దంతో ఒక్కసారిగా ఉల్లిక్కిపడి.. నిద్రలేచి.. కలలో ప్రపంచలోనుంచి వాస్తవంలోకి వచ్చేసరికి అంతా జరిగిపోయింది.

తాము నివాసముంటున్న ఇళ్లలోకి వర్షపు నీరు చేరి బయటకు వెళ్లేందుకు కూడా అస్కారం లేకుండా చేసింది. ఇదంతా వేకువ జామున కురిసిన వర్షం ప్రభావమే. వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినా.. ఏకంగా 18 సెంటీమీటర్ల పైన వర్షం నమోదు అవుతుందన్న వారు చెప్పలేదు. గత నూట ఇరవై ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఇంతటి తీవ్రస్థాయిలో జడివానను చూడలేదని బెంగళూరు నగరవాసులు పేర్కొంటున్నారు. ఫలితంగా బెంగుళూరు నగరం అతలాకుతలమైంది. ఎక్కడ చూసినా వరదనీరే కనిపిస్తోంది. ఐటీ కంపెనీలు అత్యధికంగా ఉండే కోరమంగళతో పాటు యలహంక తదితర ప్రాంతాల్లో వేలాది అపార్టుమెంట్లు నీట మునిగాయి. వందలాది వాహనాలు రోడ్లపై కదలక మొరాయించడంతో ట్రాఫిక్ గంటల కొద్దీ స్తంభించింది.

127 ఏళ్ల నాడు ఇంత భారీ వర్షం కురిసిందని, 1890, ఆగస్టు 27న 16 సెంటీమీటర్ల వర్షం కురవగా, ఆపై మంగళవారం నాడు 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వర్షం మంగళవారం సాయంత్రం వరకూ పడుతూనే ఉందని, తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో రాష్ట్ర డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ సిబ్బంది రంగంలోకి దిగారని అధికారులు తెలిపారు. బైలికహళ్లి ప్రాంతంలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. బాధిత కుటుంబాలకు ఆహారం, మంచినీటిని అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించామని, కోరమంగళ ప్రాంతంలోని ఎస్టీ బెడ్ ఏరియాలో 40 రెస్క్యూ బోట్లతో నీటిలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చామని తెలిపారు. జయనగర్, బెన్నార్ ఘట్ట రోడ్డు, రాజరాజేశ్వరీ నగర్, జేపీ నగర్, నాగభైరవి, ఉత్తర హళ్ళి, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ తదితర ప్రాంతాల్లో వరద ప్రభావం అధికంగా ఉందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bengaluru  heavy rain  flood  appartments  Natural disasters and extreme weather  karnataka  

Other Articles