special she shuttle bus sevices for women working in IT sector హైదరాబాద్ మహానగరంలో ఐటీ మహిళలు సేఫ్..

Special she shuttle bus sevices for women working in it sector

rachakonda police commissionerate along with hyderabad and cyberabad commissionerate brings special she shuttle services for women working in IT sector.

rachakonda police commissionerate along with hyderabad and cyberabad commissionerate brings special she shuttle services for women working in IT sector.

హైదరాబాద్ మహానగరంలో ఐటీ మహిళలు సేఫ్..

Posted: 08/16/2017 01:55 PM IST
Special she shuttle bus sevices for women working in it sector

దేశవ్యాప్తంగా మహిళ రక్షణ పోలీసులకు కత్తి మీద సాములా మారింది. ఏక్కడ ఏ నేరం జరుగుతుందో. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సివస్తుందోనని వారు అనునిత్యం అందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా అర్థరాత్రిళ్లు విధులు ముగించుకుని ఇళ్లకు చేరుకునే యువతులు, మహిళల విషయంలో ఈ మధ్య బీజేపి అధ్యక్షుడి కుమారుడు ఒక చోట, దేశ రాజధాని ఢిల్లీలో మరో మహిళ ఇలాంటి పోకిరీలు వెంటపడుతుంటే వారి నుంచి తప్పించుకుని పోలీసులకు పిర్యాదు చేసిన ఘటనలు వెలుగు చూడటంతో.. అసలు మహిళలకు భద్రత కరువైందన్న విమర్శలు కూడా వనబడుతున్నాయి.

ఈ నేపథ్యంలో మహిళల విషయమై చెందుతున్న అందోళనను అధిగమించి.. రాచకొండ పోలీసు ఓ వినూత్న నిర్ణయంతో ముందుకోచ్చారు. అదే ఐటీ కేంద్రంలో పనిచేసే మహిళలకు ప్రత్యేక షటిల్ సర్వీసులను తీసుకోచ్చారు. కేవలం మహిళలను మాత్రమే అనుమతించే ఈ వాహనాల్లోకి వారు క్షేమంగా వార్వారి గమ్యస్తానాలకు చేరుకునే వెసలుబాటు కల్పించారు. ఇవాళ అధికారింకంగా ప్రారంభమైన ఈ బస్సు సర్వీసులు.. ఐటీ కారిడార్ లో మహిళా ఉద్యోగినుల సురక్షిత ప్రయాణం కోసం వినియోగంలోకి వచ్చాయి.

సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహాకారంతో ఈ ‘షీ షటిల్’ సర్వీసులను ఎల్బీనగర్ నుంచి పోచారం ఐటీ కారిడార్ వరకు రాచకొండ పోలీసులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐటీ ఉద్యోగినులకు వారి ప్రయాణంలో భద్రత మరింత పెరగనుందని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ ఐటీ కారిడార్‌లో దాదాపు 20 వేల మంది మహిళ ఉద్యోగులు ఉన్నారన్న అయన.. వారి భద్రత, సురక్షణ కోసం ఈ సర్వీసులు దోహదపడనున్నాయని అన్నారు. ఈ బస్సు సర్వీసుల ప్రారంభోత్సవానికి హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యలు హాజరయ్యారు. అవసరమైన వారందరికీ ‘షీ షటిల్’ సర్వీసు బస్సు వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తుంది. సైబరాబాద్‌లో ఈ షీ షటిల్ బస్సు సర్వీసులను ప్రతి రోజు దాదాపు 1200 మంది మహిళ ఐటీ ఉద్యోగినులు ప్రయాణించవచ్చనని అంచనా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles