colony ladies complaint against conistable srinivas పోలీసోడి మత్తు దించండీ బాబు.. పదేళ్ల నరకం..

Colony ladies complaint against conistable srinivas in pathikonda

conistable srinivas, inebriated condition, colony ladres, navaramma colony, pathikonda town, anpari police station, ci vikram simha, crime

colony ladies complaint against conistable srinivas, who drunks daily and abuses them, and even threatens to file atrocity case against them if questioned in pathikonda

పోలీసోడి మత్తు దించండీ బాబు.. పదేళ్ల నరకం..

Posted: 08/12/2017 09:42 AM IST
Colony ladies complaint against conistable srinivas in pathikonda

తమ కాలనీలో ఓ పోలీసు కానిస్టేబుల్ నివసిస్తున్నాడని తెలిస్తే.. ఇక తమ కాలనీ వైపు ఏ దొంగ కనీసం చూడటానికి కూడా భయపడతారని సాధరణంగా ప్రజల నమ్మకం. అంతేకాదు అతడ్ని చూసినప్పుడల్లా తమ పిల్లలు కూడా పెడదారి పట్టకూడదని గుర్తుకు వస్తుందని దీంతో సన్మార్గంలో నడుస్తారని కూడా కాలనీవాసులు అశిస్తుంటారు. కానీ అలాంటి నమ్మకాన్ని నట్టేట ముందిన ఓ కానిస్టేబుల్ పీకత వరకు మద్యం తాగి.. కాలనీ వాసులకు ప్రతీ రోజు నరకం చూపుతున్నాడు. తాను అదర్శంగా వుండాల్సింది పోయి.. పోలీసు అంటే ఎలా వుండకూడదో అని చెబుతున్నాడు.

ప్రతి రోజు మద్యం తాగి వచ్చి మహిళలను అసభ్యంగా మాట్లా డుతుండడంతో ఇక కాలనీ మహిళలు అతని చేష్టలతో చిర్రెత్తిపోయారు. కానిస్టేబుల్ పై ఉన్నతాధికారులకు పిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. పత్తికొండ పట్టణం పోలీసు స్టేషన్ కు వెళ్లిన కాలనీ మహిళలు శ్రీనివాసులపై సీఐకి ఫిర్యాదు చేశాడు. పత్తికొండ పట్టణం సవారమ్మ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు ఆస్పరి పోలీస్‌‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తాగి వచ్చి కాలనీలో తమ పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నాడని, గట్టి గా మాట్లాడితే ఎస్సీ కేసు పెడతానని బెదిరిస్తున్నాడని శుక్రవారం కాలనీ మహిళలు సీఐ విక్రమ్‌సింహకు ఫిర్యాదు చేశారు.
 
అతను కాలనీలోకి వచ్చి సుమారు పదకొండేళ్ల అవుతుందని, సుమారు పదేళ్లుగా అకారణంగా తమపై  అసభ్య పదజాలాన్ని వినియోగిస్తూ బూతులు తిడుతున్నాడని వారు తమ పిర్యాదులో పేర్కోన్నారు. గట్టిగా ప్రశ్నిద్దామని ఎవరైనా అతడ్ని అడ్డుకుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాడేమెనన్న భయంతో ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారని వారు సిఐకి వివరించారు. కానిస్టేబుల్‌ శ్రీనివాసులను స్టేషన్‌కు పిలిపించిన సీఐ అతని వివరణ కోరగా,.. ఫిర్యా దు చేస్తున్న మహిళలే తనను కులం పేరు తో దూషించారని చెప్పాడు. దీంతో కానిస్టేబుల్‌ను ఆల్‌హ్కాల్‌ పరీక్ష కో సం పత్తికొండ ప్రభుత్వాస్పత్రికి పంపించా రు. రిపోర్టు వచ్చాక కానిస్టేబుల్‌పై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని సీఐ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles