four days consecutive holidays for banks పంద్రాగస్టు వరకు బ్యాంకులు బంద్.. వరుస సెలవులే..

Four days consecutive holidays for banks

Banks, holiday, Independence day, second saturday, sri krishna janmasthimi, independence day, consecutive holidays, sunday, vinaka chavithi, 4th saturday

bank transactions halts for four days upto independence day from tomarrow, in lieu of continous holidays which begins from second saturday of this week.

పంద్రాగస్టు వరకు బ్యాంకులు బంద్.. వరుస సెలవులే..

Posted: 08/11/2017 12:56 PM IST
Four days consecutive holidays for banks

బ్యాంకు ఉద్యోగులకు అగస్టు మాసం కలసివచ్చింది. ఈ నెలలోని రెండు పర్యాయాలు వరుస సెలవులు రావడంతో వారు సరదాగా గడిపే అవకాశాన్ని అందిస్తుంది. ఈ నెల 12 నుంచి 15 వరకు ఏకంగా నాలుగు రోజుల పాటు ఒక పర్యాయం వారికి వరుస సెలవులు లభించగా, ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు రెండో పర్యాయం బ్యాంకు ఉద్యోగులకు వరుస సెలవులు రానున్నాయి. ఈ వరుస సెలవులతో బ్యాంకు కస్టమర్లకు ఇబ్బందులను తీసుకువస్తుంది.

అసలే దొరక్క,దొరక్క దొరికిన వరుస సెలవులను కుటుంబాలతో హాయిగా గడిపేందుకు ప్లాన్ చేసుకునే వారికి బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు, అక్కడక్కడా ఏటీయంలో వున్న అరకోర క్యాష్ ను కూడా వరుస సెలవుల నేపథ్యంలో కస్టమర్లు డ్రా చేస్తున్నారు. అసలే అదివారం కూడా రావడంతో అందుకు అనుగూణంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఖాతాదారులు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఇక డిజిటల్ లావాదేవీలు లభ్యం కాని పలు నిత్యావసరాలకు కూడా క్యాష్ అవసరం చాలానే వుంటుంది. అవసరమున్న వారు ఇవాళ్లే బ్యాంకులకు వెళ్లి నగదు తెలచ్చుకునేందుకు పరుగులు పెడుతున్నారు.

ఈనెల 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న శ్రీకృష్ణ జన్మాష్టమి, 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ఈ 4 రోజులు బ్యాంకుల్లో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అయితే ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలు మాత్రం యథావిధిగా సాగుతాయి. ఇప్పటికే అరకొర నగదు, పని చేయని ఏటీఎంలతో సమస్యలు ఎదుర్కొంటున్న ఖాతాదారులకు వరుస సెలవుల రూపంలో ఇబ్బందులు పెరగనున్నాయి. మరోవైపు ఈనెల 25 నుంచి కూడా వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. 25న వినాయక చవితి, 26న 4వ శనివారం, 27న ఆదివారం కావడంతో మూడు రోజులు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles