Buxar DM 'suicide': Colleague hints at family problems కలకలం రేపిన కలెక్టర్ అత్మహత్య..

Buxar dm mukesh pandey found dead on railway tracks in ghaziabad

Mukesh Pandey, Mukesh Pandey dead, Mukesh Pandey Buxar, Mukesh Pandey buxar DM, District Magistrate of Buxar, Mukesh Pandey suicide, Mukesh Pandey Ghaziabad, Ghaziabad, Buxar magistrate, suicide, Ghaziabad, Bihar, crime

Mukesh Pandey, the District Magistrate of Buxar who committed suicide in Ghaziabad was a senior IAS officer and was recently appointed as the DM of city.

కలహాల కాపురం.. కలెక్టర్ బలవన్మరణం..

Posted: 08/11/2017 12:09 PM IST
Buxar dm mukesh pandey found dead on railway tracks in ghaziabad

దేశరాజధాని న్యూఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలో కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేశ్ పాండే రైలు పట్టాలపై దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ బంధువులకు అనారోగ్యం పాలుకాగా, వారిని పరామర్శఇంచేందుకు వచ్చిన  ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో రైలు పట్టాలపై శవమై కనిపించారు. వేగంగా వస్తున్న రైలుకు ఎదురువెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో తరచూ జరుగుతున్న గొడవల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు ఢిల్లీ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

పాండే జేబులో ఒక కాగితాన్ని గుర్తించిన పోలీసులు... దాని ఆధారంగా ఆయన బస చేసిన హోటల్ గదికి వెళ్లి, సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందే ఢిల్లీలోని జానక్ పురి ప్రాంతంలోని ఓ భవంతిపై నుంచి దూకి అత్మహత్య చేసుకుంటున్నట్లు పాండే తమ బంధువులకు మెసేజ్ పెట్టారు. అయితే తన అత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ తాను రాసిపెట్టిన సూసైడ్ నోట్ కూడా హోటల్ గదిలో వుందని బంధువులకు పంపిన మేసేజ్ లో పేర్కొన్నారు. పాండే బస చేసిన లీలా హోటల్ గదిలోంచి పోలీసులు సూసైడ్ లెటర్ ను స్వాధీనం చేసుకున్నారు.

2012 బ్యాచ్ బీహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారినైన తాను ప్రస్తుతం బీహర్ లోని బక్సర్ జిల్లా కలెక్టరుగా పనిచేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని... ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలియజేయాలని చెప్పారు. మనిషి అనేవాడికి ఇక్కడ మనుగడ లేదని... బతకాలనే కోరిక చచ్చిపోయిందని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపారు. అయితే కుటుంబ కలహాలు మనిషికి మన్సశాంతిని దూరం చేస్తాయని.. అందుచేతు పాండే తీవ్ర పరిణామంగా అత్మహత్యకు పాల్పడ్డాడని అతని స్నేహితులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mukesh Pandey  Buxar magistrate  suicide  Ghaziabad  Bihar  crime  

Other Articles