hired party cadre canvassing in nandhyal for tdp అద్దె కార్యకర్తలతో ప్రచారం.. అన్నింటికీ పచ్చటోకెన్ అధారం..

Hired party cadre canvassing in nandhyal for ruling party

Nandyal by elections, TDP campaign, rented people, green tokens, hired party cadre, hired canvassing, kurnool, TDP, YCP, Chandra babu Naidu, Jagan Mohan Reddy

TDP leaders hire people from different constutuencies to canvass in nandhyal by-poll, and distributing green coloured token for their transactions

అద్దె కార్యకర్తలతో ప్రచారం.. అన్నింటికీ పచ్చటోకెన్ అధారం..

Posted: 08/11/2017 11:42 AM IST
Hired party cadre canvassing in nandhyal for ruling party

గెలుపు కోసం ఏం చేయడానికైనా సిద్దమైంది అక్కడి అధికార పార్టీ. తమ ఉనికి కాపాడుకుని తమకు ఓటమి లేదని రుజువు చేసుకునేందుకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఇంకా చేస్తుంది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందు వచ్చిన ఈ ఉప ఎన్నికలలో గెలుపు తమ పరిపాలనకు రెఫరండంగా పరిగణిస్తున్నారు అధికార పార్టీకి చేందని నాయకులు. అధికారంలేని తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓ నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును కొనేందుకు ఏకంగా రెండు కోట్ల రూపాయల మేర డీల్ మాట్లాడుకున్న పార్టీ.. ఇక తాము అధికారంలో వున్న కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో ఎం చేయడానికైనా సిద్దంగా వుందని.. ప్రతిపక్ష పార్టీ నేతలు ఇప్పటికే నంద్యాల ఓటర్లను అప్రమత్తం చే్స్తున్నారు.

ఇప్పటికే ఓటమి భయం వెన్నాడుతున్న అధికార పార్టీకి ఎన్నికల సంఘం కూడా షాక్ ఇచ్చింది. అధికార టీడీపీ పార్టీ ఇటీవల చేర్పించిన దాదాపు 16 వేల బోగస్ ఓట్లర్లకు ఓటు వేసే హక్కును కల్పించకుండా జనవరిలో వున్న ఓటరు లిస్టుతోనే తాము ఎన్నికలకు వెళ్లనున్నామని కూడా చప్పింది. దీంతో ఇప్పటికే చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా మారిన అధికారా పార్టీ నేతలకు పలు మీడియా సంస్థల అండదండలతో వారి అవేశపూరిత వరుస ప్రసంగాలు.. ప్రజలకు చేరుతున్నాయే తప్ప.. నిజానికి గ్రౌండ్ రియాలిటీ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వుందని ఈ ఘటన రుజువు చేస్తుంది. అధికార పార్టీ నేతలకు పార్టీ తరపున ప్రచారం చేయడానికి కార్యకర్తలు కూడా లేని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి

ఈ క్రమంలో టీడీపీ నేతలు తమ ప్రచార కార్యక్రమాల కోసం పలువురు మహిళలతో పాటు పురుషులను కూడా రోజూవారి అద్దెకు మాట్లాడుకుని వారితో ప్రచారం నిర్వహించేందుకు తెరలేపారు. అదే జిల్లాకు చెందిన స్థానికేతరులను ప్రచారం చేయిస్తున్నారు. అయితే ఇలా వచ్చిన వారికి డబ్బులు చెల్లించాల్సి వుండటంతో వారికి టోకెన్ విధానాన్ని అవలంభిస్తున్నారు. అకుపచ్చ వర్ణంలో వున్న టోకెన్లను వారికిచ్చి.. అనంతరం వాటిని వారి డబ్బులకు. బోజనాలకు, ఇత్యాదులకు దానినే వినియోగించేలా చేస్తున్నారు.  

నంద్యాలలోని 42వ వార్డులో డబ్బులిచ్చి తీసుకువచ్చిన అద్దె కార్యకర్తలకు టీడీపీ నేతలు పచ్చరంగులో ఉన్న టోకెన్లను పంచుతూ అడ్డంగా బుకయ్యారు. ఈ విషయం బయటకు రావడంతో అధికార పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ ప్రచారంలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలకు బోజనాల కోసం మాత్రమే తాము టోకెన్లను పంచుతున్నామని టీడీపీ నేతలు బుకాయిస్తున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శస్తున్నారు. ఎన్నికలకు మరో 13 రోజుల వ్యవధి వుండగానే అధికార పార్టీ ఇలా చేస్తుండగా, ఇక చివరి మూడు రోజుల్లో మరెన్ని అడ్డదారులు తొక్కుతుందోనని అందోళన వ్యక్త్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles