Venkaiah Naidu sworn in as 13th vice president భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ప్రమాణస్వీకారం

Venkaiah naidu sworn in as 13th vice president will take charge as rajya sabha chairman

Vice-President of India‬, ‪Venkaiah Naidu‬, ‪Delhi‬, ‪President of India‬, ‪Rajya Sabha‬‬, Mohammad Hamid Ansari, vice president, Ramnath Kovind, PM Modi, Amit Shah, LK Advani, ManMohan singh, Union Ministers

Venkaiah Naidu sworn in as the thirteenth vice president of India at Rashtrapati Bhawan, President Ram Nath Kovind administered the oath to Naidu at a grand ceremony, who will take charge as rajya sabha chairman

భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ప్రమాణస్వీకారం

Posted: 08/11/2017 10:33 AM IST
Venkaiah naidu sworn in as 13th vice president will take charge as rajya sabha chairman

దేశ 13వ ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన మాజీ కేంద్రమంత్రి ఎం వెంకయ్యనాయుడు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరు ఇవాళే ఆయన రాజ్యసభ చైర్మెన్ గా కూడా బాధ్యతలను అందుకోనున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వెంకయ్య చేత ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు జాతీయ (భారత రాజ) బాష హిందీలో ప్రమాణస్వీకారం చేశారు. దేశ రెండో అత్యున్నత పదవికి వెంకయ్యనాయుడు ఎన్నిక కావడం.. ఈ పదవిలో కొనసాగనున్న తొలి దక్షిణాది వ్యక్తి కావడం కూడా గమనార్హం.

అయితే ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తన మనస్సులోని మాటలను చెప్పేందుకు మైకు ముందుకు వచ్చిన వెంకయ్య.. అక్కడున్న అధికారులను తాను మాట్లాడవచ్చా అని అడిగారు. అయితే అధికారులు అది ప్రోటోకాల్ కు విరద్దమని చెప్పడంతో ఏమీ మాట్లాడకుండానే ఆయన తనకు కేటాయించిన సీటులో అసీనులయ్యారు. ప్రమాణ స్వీకారం తరువాత రాష్ట్రపతి వేదికపై నున్న క్రమంలో ప్రసంగాలు చేయకూడదన్నది ప్రోటోకాల్. దీంతో వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేసిన తరువాత తొలి ప్రసంగానికి బ్రేక్ పడింది.

బీజేపి తలపండిన నేతగా, అపార అనుభవశాలిగా దేశంలోని రాజకీయాలపై, అవసరాలపై అవలీలగా మాట్లాడే వెంకయ్య.. రాజ్యసభ చైర్మన్ గా ఇక మాటాల్లడానికి బదులు వినడానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి వుంటుంది. కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపి అగ్రనేత లాల్ కిషన్ అద్వానీ, అంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, బీజేపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు పార్టీల అధినేతలు హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles