సైనికులు కాదు దారుణమైన రేపిస్టులంట... | Writer Slammed for Soldiers as Rapists Comments

Kannada book derogatory comments on soldiers

Mangalore University, Indian Soldiers Insult, Soldiers as Rapists, Ganesh Karnik Soldiers, Mangalore University Controversy, Baraguru Ramachandrappa, Yuddha Ondu Udyama Controversy, Yuddha Ondu Udyama Lesson

A lesson in the Kannada language textbook for first year B.Sc (animation) and BCA students of Mangalore University has landed in a controversy, with Ganesh Karnik, Chief Whip of the Opposition in the Legislative Council, demanding that the university remove it as it “insults soldiers”.

రేపిస్ట్ సైనికులపై రచ్చ.. రచ్చ..

Posted: 08/11/2017 08:58 AM IST
Kannada book derogatory comments on soldiers

మంగళూరు విశ్వవిద్యాలయంలో బీఎస్సీ(యానిమేషన్) మరియు బీసీఏ ప్రథమ సంవత్సరం సిలబస్ లో ఓ పాఠ్యాంశం వివాదాస్పదమవుతోంది. సైనికులు రేపిస్టులంటూ అందులో పేర్కొనటంపై పలువురు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సీనియర్‌ సాహితీవేత్త బరుగూరు రామచంద్రప్ప రచించిన ‘యుద్ధం ఒక పరిశ్రమ(యుద్ధ ఒండు ఉద్యమ)’ అనే అంశాన్ని సిలబస్ లో చేర్చారు. ఇందులో రచయిత సైనికులపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ఈ పాఠంలో సైనికులను రేపిస్టులుగా అభివర్ణించడం వివాదాస్పదమైంది. దీనిపై ప్రజా, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే వివాదంపై రచయిత మాట్లాడుతూ, ఈ రేపిస్టు అన్న భావజాలం తన సొంతది కాదని, ఒకమిత్రుడు చెప్పిన అంశాల మేరకు తాను దానిని ప్రస్తావించానని అన్నారు.

సైనికుల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు. అయినా ఈ పుస్తకాన్ని పరిశీలించి ముద్రించేందుకు ఒక కమిటీ ఉంటుందని, ఆ కమిటీ దానిని పరిశీలించిన తరువాత దానిపై స్పందిస్తానని ఆయన తెలిపారు. మరోపక్క బీజేపీ ఎమ్మెల్సీ గణేష్ కర్ణిక్ ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాడు. ఆయన క్షమాపణలు చెప్పటంతోపాటు ఆ పాఠ్యాంశాన్ని తక్షణం తొలగించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mangalore University  Indian Soldiers  

Other Articles